జన్వాడ ఫామ్ హౌస్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. రాజ్ పాకాల ఫాంహౌస్‌లో పార్టీ కలకలం రేపిన విషయం అందరికీ తెలిసిందే. ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది. అందిన సమాచారం మేరకు రాజ్ పాకాల ఫాంహౌస్‌కి చేరుకున్న పోలీసులు అక్కడున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో మహిళలు, పురుషులను అదుపులోకి తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ.. సీఎం రేవంత్ సంచలన ప్రకటన
ఆపై యూరిన్ టెస్ట్ చేశారు. ఈ టెస్ట్‌లో రాజ్ పాకాల స్నేహితుడు విజయ్ మద్దూరి కొకైన్ తీసుకున్నట్లు అధికారులు నిర్థారించి కేసు నమోదు చేశారు. ఆపై విచారణకు హాజరుకావాలని విజయ్ మద్దూరికి నోటీసులు పంపించగా.. ఆ విచారణకు హాజరు కాలేదు.
Also Read : దీపావళికి ఇల్లంతా దీపాలు.. ఎందుకో తెలుసా? అసలు కథ ఏంటి?
విజయ్ మద్దూరి నివాసంలో సోదాలు
దీంతో పోలీసుల నోటీసులకు స్పందించకపోవడంతో ఇవాళ (మంగళవారం) జూబ్లీహిల్స్‌లోని విజయ్ మద్దూరి నివాసంలో సోదాలు చేపట్టారు. జన్వాడలో సోదాల టైంలో విజయ్ మద్దూరి పోలీసులకు మరొకరి ఫోన్ ఇవ్వగా.. ఇప్పుడు పోలీసులు అతడి ఫోన్ సీజ్ చేసేందుకు వచ్చారు. దాదాపు గంటకు పైగా మోకిల పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు.
Also Read : 10 నిమిషాల రన్నింగ్‌తో ఆ ప్రమాదకరమైన వ్యాధులు దూరం
ఇదిలా ఉంటే ఇదే విషయంపై విజయ్ మద్దూరి ఇటీవల స్పందిస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు. రాజ్ పాకాల ఫాంహౌస్ పార్టీ కేసులో తనపై చేస్తున్నవన్నీ తప్పుడు ఆరోపణలని అన్నారు. తన స్నేహితుడు రాజ్ పాకాల ఫ్యామిలీ ఫంక్షన్‌కి దివాళీ పార్టీ కోసం ఆహ్వానించాడని.. ఆ పార్టీకి కుటుంబంతో కలిసి హాజరైనట్లు తెలిపారు.
Also Read : KTR, హరీష్ మధ్య కొట్లాట.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు!
తాను ఎలాంటి ఇల్లీగల్ పదార్థాలు సేవించలేదన్నారు. పోలీసులు చేస్తున్న తప్పుడు ఆరోపణలకు ఆవేదనకు గురవుతున్నానంటూ చెప్పుకొచ్చాడు. దాదాపు 25 ఏళ్లుగా కెరీర్‌లో ఎలాంటి మచ్చ లేకుండా ఉన్నానని.. ఇప్పుడు ఒక్క ఆరోపణతో మంటగలిపే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు.