Telangana Rains: రానున్న మూడు రోజుల పాటు తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో మరో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ లేదని చెప్పారు. పలు జిల్లాల్లో మాత్రం తేలికపాటి జల్లులు కురిసే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.
Also Read: తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..ఎప్పుడంటే!
అక్టోబర్ 29 నుంచి మూడ్రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వివరించారు. అప్పటి వరకు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని వివరించారు. ఇక గత కొద్ది రోజులుగా తెలంగాణలో భిన్న వాతావరణం ఉంటున్న సంగతి తెలిసిందే. మధ్యాహ్నం సమయంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. పగటి పూట ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇక సాయంత్రం వాతావరణం చల్లబడుతుండగా.. అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లవారుజామన వరకు చలి వాతావరణం ఉంటుంది. ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోతున్నాయి.
Also Read: తెలంగాణలో 10 మంది ఎస్పీలు డిస్మిస్...!
తీవ్ర వేడి, ఉక్కపోతతో...
రాష్ట్రంలో రెండు రోజుల నుంచి అత్యధికంగా 35 డిగ్రీల అధిక పగటి ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. దీంతో ప్రజలు తీవ్ర వేడి, ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. పగటి పూట ఎండలు, వేడి గాలులకు ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు.ఇక హైదరాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీలు నమోదనైట్లు అధికారులు చెప్పారు. రాత్రి సమయంలో 20 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. తెలంగాణలో అత్యల్ప పగటి ఉష్ణోగ్రతలు మహబూబ్ నగర్ జిల్లాలో 29 డిగ్రీలు నమోదైంది.
Also Read: ఆ మూడు సినిమాలు కలిపితే 'కల్కి 2'.. అంచనాలు పెంచేసిన నాగ్ అశ్విన్
ఇక దానా తుపాను ముప్పు ఒడిశా, పశ్చిమ బెంగాల్‌తో పాటుగా ఏపీ, తెలంగాణకు కూడా తప్పినట్లే. అయితే ఏపీలోని ఉత్తర కోస్తా ,యానాం ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఒకట్రెండు చోట్ల చిరు జల్లులు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం అంచనావ వేసింది. ఏపీలోని దక్షిణ కోస్తా జిల్లాల్లోనూ ఒకట్రెండు చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు చెప్పారు.
Also Read: అప్పుడు దూకుడు..ఇప్పుడు ఆగుడు.. HYDRA 100 డేస్ ప్రోగ్రస్ రిపోర్ట్ ఇదే!
రాయలసీమ జిల్లాల్లో రెండు రోజులపాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఒకట్రెండు చోట్ల మోస్తరు వర్షాలు పడతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం ఉత్తర ఒడిశాలో అల్పపీడనం కొనసాగుతోందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 6 గంటల్లో ఇది మరింత బలహీనపడుతుందని అధికారులు తెలిపారు.