Telangana Cabinet: నేడు తెలంగాణ కేబినెట్ భేటీ!

TG: ఈరోజు రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. హైడ్రాకి చట్ట బద్దత ద్వారా ఆర్డినెన్సు తీసుకురావడం, భారీ వర్షాలు- వరదల కారణంగా జరిగిన నష్టం, రేషన్ కార్డులు జారీ, హెల్త్ కార్డులు, రుణమాఫీ, రైతు భరోసా వంటి కీలక అంశాలపై మంత్రి వర్గం చర్చించనున్నట్లు సమాచారం.

author-image
By V.J Reddy
New Update
telangana cabinet

Telangana Cabinet: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ఈ భేటీలో రాష్ట్ర మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. అలాగే చెరువులు కబ్జా చేసిన నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చేసింది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన హైడ్రాను మరింత బలోపేతం చేసేందుకు కీలక నిర్ణయం తీసుకోనుంది. అలాగే తెలంగాణ భూఆక్రమణ చట్టం-1905కు సవరణ చేసి కొత్త చట్టాన్ని తీసుకురావాలన్న యోచనలో సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది.న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా పలు శాఖల్లోని చట్టాల్లో సవరణలు చేసేలా కార్యాచరణ చేపట్టనుంది. హైడ్రా సంబంధించి ఆర్డినెన్స్ ఆమోదించే అవకాశం ఉంది.

కీలక అంశాలపై చర్చ..

తెలంగాణలోని మూడు యూనివర్సిటీలకు పేర్లు ఖరారు చేయడంపై రాష్ట్ర మంత్రి వర్గం చర్చించనుంది. ఇప్పటికే మూడు యూనివర్సిటీలకు తెలంగాణ పోరాట యోధుల పేర్లు పెట్టాలనే ఆలోచనలో రేవంత్ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు తెలంగాణలో భారీ వర్షాల కారణంగా చెరువులు, డ్యాములు, కాలువలు నిండి కొన్ని గ్రామాలు నీట మునిగాయి. ఇండ్లు నేలమట్టం అయ్యాయి. ఇప్పటికే వరద బాధితులకు అండగా ఉంటామని రాష్ట్ర ప్రభుత్వం హామీతో పాటు కొన్ని గ్రామాల్లో బాధితులకు రూ.10,000.. మరికొన్ని గ్రామాల్లో రూ.15,000 ఆర్థిక సాయాన్ని అందించిన సంగతి తెలిసిందే. కాగా  భారీ వర్షాలు- వరదల కారణంగా జరిగిన నష్టంపై మంత్రి వర్గం చర్చించనుంది.

రైతు భరోసా..

తెలంగాణలో కొలువు దీరిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా (రైతు బంధు) కింద రైతులకు ఏడాదికి ఎకరాకు రూ.15,000 పెట్టుబడి సాయం అందిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చి దాదాపు 10 నెలలు గడుస్తున్నా ఇప్పటికి వరకు రైతు భరోసాపై ఎలాంటి ప్రకటన చేయలేదు.. నిధులు విడుదల చేయలేదు. అధికారంలో వచ్చిన మొదటి సారి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన రైతు బంధు కిందనే ఎకరాకు రూ.10,000లను కాంగ్రెస్ సర్కార్ అందించింది. అయితే ఈరోజు జరిగే కేబినెట్ భేటీలో రేషన్ కార్డులు జారీ, హెల్త్ కార్డులు మంజూరు?, రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు, త్రిబుల్ ఆర్ భూసేకరణ, పనుల ప్రారంభం, ఎస్ఎల్బిసి పనులు – నిధుల విడుదల, ఉద్యోగుల డీఏలు – సమస్యలు తదితర అంశాలపై చర్చించున్నట్లు సమాచారం.

Advertisment
తాజా కథనాలు