BRS: బీఆర్ఎస్‌లోనే ఉంటే పార్టీ ఆఫీస్‌కు రా.. అరికేపూడికి కౌశిక్ సవాల్! బీఆర్ఎస్‌లోనే ఉంటే తెలంగాణ భవన్‌కు రావాలని అరికేపూడి గాంధీకి సవాల్ విసిరారు పాడి కౌశిక్ రెడ్డి. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు భయం పట్టుకుందన్నారు. By V.J Reddy 11 Sep 2024 | నవీకరించబడింది పై 11 Sep 2024 15:53 IST in తెలంగాణ కరీంనగర్ New Update షేర్ చేయండి Padi Kaushik Reddy: అసెంబ్లీ ఎన్నికలు తరువాత బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సెక్రటరీకి ఇచ్చిన పిటీషన్ పై స్పీకర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు వస్తాయని తెలిసి పార్టీ మారిన ఎమ్మెల్యేలు గజగజ వణుకుతున్నారని అన్నారు. పూటకో పార్టీ మారే దానం నాగేందర్ బిచ్చగాడు, చీటర్, శాశ్వతంగా మాజీ ఎమ్మెల్యేగా మిగిలిపోతాడని అన్నారు. సిగ్గు, శరం లేదా?.. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సిగ్గు, శరం లేదా? రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కడియం శ్రీహరి పచ్చి మోసగాడు, పొద్దున కేసీఆర్ దగ్గర బ్యాగులు తీసుకొని వెళ్లి సాయంత్రం కాంగ్రెస్ పార్టీలో చేరాడని మండిపడ్డారు. కడియం శ్రీహరి స్టేషన్ ఘన్ పూర్ లో డిపాజిట్ తెచ్చుకోవాలని అన్నారు. అరికెపూడి గాంధీ నేను కాంగ్రెస్ కండువా కప్పుకోలేదు అంటున్నారని.. నేను దేవుడు కండువా కప్పుకున్నానని అంటున్నారని అన్నారు. కాంగ్రెస్ లో చేరానని గాంధి యే స్వయంగా మీడియా కు చెప్పి ఇపుడు మాట మారుస్తున్నారని ఫైర్ అయ్యారు. పార్టీ మారిన వారు హై కోర్టు తీర్పు తర్వాత గజగజ వణుకుతున్నారని అన్నారు. స్పీకర్ నిర్ణయం దాకా ఆగకుండా పిరాయించిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉపఎన్నికలను ఎదుర్కోవాలని అన్నారు. ఎపుడు ఎన్నికలు వచ్చిన ఆ పది సీట్లు బీఆర్ఎస్ గెలుస్తుందని అన్నారు. అరికేపూడి గాంధీ నకిలీ గాంధీ అని చురకలు అంటించారు. కేసీఆర్ విడిగా కాంగ్రెస్ ఎమ్మెల్యేను చేర్చుకున్నారని నిరూపిస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని అన్నారు. అరికేపూడి గాంధీ మా పార్టీ సభ్యుడు అయితే తెలంగాణ భవన్ కు రావాలని సవాల్ చేశారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు చీర, గాజులు గిఫ్టుగా పంపుతున్న, ఇవి వేసుకుని తిరగండి అంటూ విమర్శలు గుప్పించారు. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి