Matrimony Fraud: పెళ్లంటే అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూసుకుని సంబంధం కుదుర్చుకోవాలని పెద్దలు చెబుతుంటారు. కానీ.. ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. మ్యాట్రిమొనీ సైట్స్, పెళ్లిళ్లు కుదిర్చి కమీషన్లు తీసుకునే రోజులు వచ్చేశాయి. అదృష్టం బాగుంటే.. మ్యాట్రిమోనీలో కుదిరిన వివాహాలు సక్సెస్ అవుతాయి. కథ సుఖాంతం అవుతుంది. లేదంటే మోసగాళ్ల బారిన పడి లబోదిబోమనాల్సిందే. ఎందుకంటే కొందరు జాదూలు ఈజీ మనీ కోసం మ్యా ట్రిమొనీ సైట్లను అడ్డాగా మార్చకుంటున్నారు. ఇప్పుడు అలాంటి ఓ కేటుగాడి బాగోతం బయపడింది. ఆ కేటుగాడి పేరు వంశీకృష్ణ.
విగ్గు పెట్టు.. కొత్త పిల్లను పట్టు
హైదరాబాద్ గచ్చిబౌలీలో నివాసం ఉంటున్న వంశీ కృష మ్యాట్రిమోనీ సైట్లలో ఫేక్ ప్రొఫైల్ తో డబ్బులు సంపాదించడం పనిగా పెట్టుకున్నాడు. సైట్లలో తాను పెద్ద ధనవంతుడు అన్నట్లుగా పరిచయం చేసుకుంటాడు. నెత్తి మీద సరిగ్గా జుట్టే లేకపోయినప్పటికీ విగ్గులు పెట్టుకుని, లుక్ మార్చుతూ ఫొటోలు అప్లోడ్ చేస్తాడు. మ్యాట్రీమోనీ సైట్లలో వరుడి కోసం వెతుకుతున్న అమ్మాయిల కు, అమ్మాయి తల్లిదండ్రులకు అందగాడు, డబ్బు ఉన్నవాడు, అందగాడు అనే భావన కలిగేలా చేస్తాడు. అందమైన ఫొటోలు పెట్టి 'కోట్ల ఆస్తి ఉన్న తనకు వధువు కావలెను' అని వంశీ కృష్ణ ప్రొఫైల్ అప్ లోడ్ చేస్తాడు. ఇలా అతడిని నమ్మి వలలో పడిన అమ్మాయిలను పెళ్లి చేసుకుని, లక్షల కట్నం దోచుకొని కొన్నాళ్లకు ముఖం చాటేస్తాడు. మరో గెటప్ తో మళ్లీ ప్రొఫైల్ అప్ లోడ్ చేస్తాడు. ఆ వచ్చిన డబ్బులతో రాయల్ లైఫ్ లీడ్ చేస్తుంటాడు. సింపుల్ గా చెప్పాలంటే.. వంశీకృష్ణ దందా ఇది. ఇలా విగ్ లు పెట్టుకుని, వేషాలు మారుస్తూ మోసాలకు పాల్పడుతున్న వంశీకృష్ణ దాదాపు 50 మంది అమ్మాయిలను పెళ్లి చేసుకుని మోసం చేశాడు.
ఒక లేడీ డాక్టర్ను కూడా ఇలానే పెళ్లి చేసుకుని మోసం చేయగా.. ఇతని మోసాన్ని గ్రహించిన ఆ డాక్టర్ తండ్రి ధైర్యం చేసి సైబర్ క్రైం పోలీసులుకు ఫిర్యాదు చేయడంతో ఇతగాడి బాగోతం వెలుగులోకి వచ్చింది. ఇలాంటి నిత్య పెళ్లిళ్ల కేసుల్లోనే ఇప్ప టికే పలుమార్లు అరెస్టయి జైలుకు వెళ్లివచ్చినా వంశీకృష్ణ బుద్ధి మాత్రం మారలేదు. నిత్య పెళ్లికొడుకుల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో మోసాలకు పాల్పడుతున్న ఈ నిత్య పెళ్లికొడుకు కోసం పోలీసులు గాలిస్తున్నారు. విగ్గులు పెట్టుకుని వేషాలు మారుస్తూ మోసాలకు పాల్పడుతున్నా డు వంశీకృష్ణ. దాదాపు 50 మంది అమ్మాయిల తల్లిదండ్రులను మోసం చేశాడు.
ఇది కూడా చూడండి: తారక్, చరణ్ ఫ్యాన్స్ కు పండగ.. థియేటర్స్ లో RRR బిహైండ్ ది సీన్స్! ట్రైలర్ చూశారా