/rtv/media/media_files/2025/09/10/in-orbit-mall-2025-09-10-17-33-37.jpg)
in orbit mall Absolute Barbeque
హైదరాబాద్ లో వీకెండ్స్ వచ్చాయంటే చాలా మంది పెద్ద పెద్ద మాల్స్ కి వెళ్లి చిల్ అవడానికి ఇష్టపడుతుంటారు. ఫుడ్, షాపింగ్, సినిమా, ఎంటర్ టైన్మెంట్ ఇలా ప్రతీది మాల్స్ లో అందుబాటులో ఉంటుంది. అందుకే జనాలు మాల్స్ కి వెళ్లేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. కొందరు సరదాగా టైం పాస్ చేయడానికి కూడా మాల్స్ కి వెళ్తుంటారు. అయితే రిచ్ లుక్, అదిరిపోయే అంబియన్స్, కాస్ట్లీగా కనిపించే వీటిలో క్వాలిటీ కూడా అదే రేంజ్ లో ఉంటుందని అందరు అనుకుంటారు కస్టమర్స్. కానీ, ఇలా అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్లే! రిచ్ గా కనిపించే ఈ మాల్స్ లో ఫుడ్ ఎలా ఉంటుంది? ఏ విధంగా సర్వ్ చేస్తున్నారు అనే విషయం తెలిస్తే షాకవుతారు.
ఎలుకలు, బొద్దింకలు
తాజాగా హైదరాబాద్‌లోని ప్రముఖ ఇనార్బిట్ మాల్స్‌లో ఉండే 'అబ్సల్యూట్ బార్బిక్యూ' ఔట్‌లెట్స్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేయగా షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఈరోజు ఉదయం ఫుడ్ సేఫ్టీ అధికారులు హైదరాబాద్‌లోని 10 అబ్సల్యూట్ బార్బిక్యూ ఔట్‌లెట్స్ పై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సిబ్బంది నిర్వాకం చూసి కంగు తిన్నారు. బంజారాహిల్స్, గచ్చిబౌలి, మేడిపల్లి, ఏఎస్ రావు నగర్ ఔట్ లెట్స్ లో దారుణాలు బయటపడ్డాయి. బంజారాహిల్స్, గచ్చిబౌలి ఔట్ లెట్స్ లోని కిచెన్, స్టోర్ రూమ్‌లలో బొద్దింకలు, ఈగలు ఉండటాన్ని గుర్తించారు. కస్టమర్లకు కుళ్ళిపోయిన పండ్లను వడ్డించడానికి సిద్ధం చేశారు.
ఈ ఫొటోస్ చూస్తే Absolute Barbeque కి వెళ్ళరు ..
— RTV (@RTVnewsnetwork) September 10, 2025
ఫుడ్ సేఫ్టీ కమిషనర్ తనిఖీలు చేపట్టగా హైదరాబాద్ లోని నగరంలోని ఏఎస్ రావు నగర్, కొంపల్లి, మేడిపల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, ఇనార్బిట్, మియాపూర్, వనస్థలిపురం, సికింద్రాబాద్ లో ఉన్న ఔట్‌లెట్స్ లో కుళ్ళిన… pic.twitter.com/TRDMMLmZNW
మేడిపల్లి ఔట్‌లెట్‌లో ఎక్స్‌పైరీ అయిన ఫుడ్ ని తిరిగి ఉపయోగిస్తున్నట్లు అధికారులు కనుగొన్నారు. ఇక ఏఎస్ రావు నగర్ ఔట్‌లెట్‌లోని స్టోర్ రూమ్‌లో ఫుడ్ ఐటమ్స్ పై ఎలుకలు తిరుగుతూ కనిపించాయి. దీనికి తోడు ,ఆహార పదార్థాలను కింద నేలపైనే ఉంచి స్టోర్ చేయడం చూసి అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఫుడ్ సేఫ్టీ నిబంధనలను ఏ మాత్రం పాటించకుండా, కస్టమర్ల ఆరోగ్యంతో ఆడుకుంటున్న అబ్సల్యూట్ బార్బిక్యూ నిర్వాహకులకు అధికారులు నోటీసులు జారీ చేశారు. అలాగే సేకరించిన శాంపిల్స్‌ను టెస్టుల కోసం ల్యాబ్‌కు పంపించారు. ఈ సంఘటన ఇప్పుడు అందరినీ భయపెడుతోంది.
Also Read: Mother Killed Daughters: ప్రైవేట్ స్కూల్లో చదివించలేదని.. ముగ్గురు పిల్లలను గొంతుకోసి చంపిన తల్లి..!