Hydra: హైదరాబాద్ శివారులో హైడ్రా తరహా కూల్చివేతలు

హైదరాబాద్ గండిపేట మండలం కోకాపేట్‌లో అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారుల కొరడా ఝుళిపిస్తున్నారు. రూ.100 కోట్ల విలువ చేసే 800 గజాల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేస్తున్నారు.

New Update
 hydra

Hydra: హైదరాబాద్ శివారులో హైడ్రా తరహా కూల్చివేతలు జరుగుతున్నాయి. గండిపేట మండలం కోకాపేట్‌లో అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారుల కొరడా ఝుళిపిస్తున్నారు. బుల్డోజర్ల ద్వారా కట్టడాల కూల్చివేస్తున్నారు. కోకాపేట సర్వే నెంబర్ 147లో సుమారు రూ. 100 కోట్ల 800 గజాల ప్రభుత్వ స్థలం కబ్జాకు గురైంది. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి అధికారులు దిగారు. తిరిగి నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. క్రిమినల్ కేసులు సైతం నమోదు చేస్తాం అని అన్నారు.

హైడ్రకు కీలక బాధ్యతలు..

హైడ్రకు కీలక బాధ్యతలు అప్పగించింది రేవంత్ సర్కార్.  హైడ్రాకు విస్తృత అధికారాలు ఇస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించారు. ఓఆర్ఆర్‌‌కు లోపల ఉన్న గ్రామ పంచాయతీలను కోర్ అర్బన్ లో కలిపామని..అన్నీ శాఖలకు ఉన్న స్వేచ్ఛ హైడ్రా కు ఇస్తున్నామని చెప్పారు.  హైడ్రా కు 169 మంది అధికారులు 904 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను నియమించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఓఆర్‌ఆర్‌ లోపల 27 అర్బన్‌, లోకల్‌ బాడీలు ఉన్నాయి.

 వాటిల్లో 51 గ్రామ పంచాయతీలను కోర్‌ అర్బన్‌లో విలీనం చేయాలని నిర్ణయించమన్నారు మంత్రులు. ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణభాగం అలైన్‌మెంట్‌ ఖరారుకు కమిటీని ఏర్పాటు చేస్తామని.. ఆర్‌అండ్‌బీ స్పెషల్‌ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో 12 మందితో కమిటీ ఉంటుందని వివరించారు. కమిటీ కన్వీనర్‌గా ఆర్‌అండ్‌బీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఉంటారు. వీటన్నిటితో పాటూ పోలీసు ఆరోగ్య భద్రత స్కీమ్‌ ఎస్‌పీఎల్‌కు కూడా వర్తిస్తుందని మంత్రులు చెప్పారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు