New Update
/rtv/media/media_files/2026/02/10/earthquake-2026-02-10-13-12-02.jpg)
earthquake
హైదరాబాద్ శివారులోని కుత్బుల్లాపూర్ సర్కిల్, గాజులరామారం డివిజన్లలోని మెట్కాన్‌గూడ ప్రాంతంలో ఒక్కసారిగా భూమి కంపించింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మంగళవారం ఉదయం 10:10 గంటల సమయంలో పెద్ద శబ్దం వచ్చి భూమి కంపించినట్లు అక్కడి ప్రజలు చెబుతున్నారు. జనం ప్రాణ భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అంతేకాదు విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని స్థానిక స్కూళ్ళు సెలవు ప్రకటించాయి. ఇది భూకంపమా లేక ఇతర పేలుడు పదార్థాల వల్ల వచ్చిన శబ్దమా? అని ప్రజలు ఆందోళనలో ఉన్నారు.
తాజా కథనాలు
Follow Us