Mahesh Goud: కౌశిక్‌పై దాడి కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు: TPCC చీఫ్

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ చేసిన దాడిపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పందించారు. అరికెపూడి గాంధీపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వాడిన భాష సరిగా లేదని అన్నారు.

New Update
MAHESH GOUD TPCC

Mahesh Goud: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ చేసిన దాడిపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పందించారు. అరికెపూడి గాంధీపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వాడిన భాష సరిగా లేదని అన్నారు. ఎవరు ఎవరిపై దాడి చేసినా కాంగ్రెస్ పార్టీ సమర్థించదని.. దాడులకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం అని చెప్పారు. ఈ దాడితో కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. కౌశిక్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్లే గాంధీ అనుచరులు ఆగ్రహానికి గురై దాడికి దిగారని అన్నారు. అరికెపూడి టెక్నీకల్ గా బీఆర్ఎస్ సభ్యుడే అని పేర్కొన్నారు. నిబంధనల మేరకే పీఏసీ ఛైర్మన్ అయ్యారని అన్నారు. ఒకవేళ బీఆర్ఎస్ నేతలు చెబుతున్నట్లుయ్ ఉప ఎన్నిక వస్తే ఆ ఉపఎన్నికలో విజయం సాధించేది కాంగ్రెస్ పార్టీ అని ధీమా వ్యక్తం చేశారు.

ఢిల్లీలో ఖర్గేతో భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో పార్టీకి మరిన్ని ఎక్కువ సీట్లు వచ్చేలా పనిచేస్తాం అని అన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా ముందడుగు వేస్తామని చెప్పారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ముఖ్యమంత్రి, పార్టీ పెద్దల చేతిలో ఉంటుందని అన్నారు. పీసీసీ అధ్యక్షుడు మారిన ప్రతిసారి కొత్త కమిటీలు ఏర్పడతాయని పేర్కొన్నారు. కొత్త కమిటీల విషయంలో ఏఐసీసీ పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

వారికి పెద్దపీట...

వెనుకబడిన వర్గాలకు పెద్దపీట వేస్తూ కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వం, పార్టీ సమన్వయంతో ముందుకు సాగాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పార్టీ ఫిరాయించిన అంశంలో హైకోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తూనే.. న్యాయ ప్రత్యామ్నాయాలు చూస్తాం అని తెలిపారు. రాజ్యాంగబద్ధంగా పార్టీ మార్పులపై నడచుకుంటాం అని అన్నారు. మా పార్టీ విధానాలు, పాలన చూసి కొందరు నేతలు వస్తే చేర్చుకున్నాం అని తెలిపారు. ప్రతిపక్ష పాత్ర నిర్వహించే స్థితిలో ఆ పార్టీ నేతలు లేరని విమర్శించారు.

Advertisment
తాజా కథనాలు