వక్ఫ్ బిల్లుపై ఓవైసీ సంచలన ప్రెస్ మీట్-LIVE

వక్ఫ్ బోర్డులో ఇతర మతాలకు చెందిన వారు ఎలా ఉంటారని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ ఈ నెల 19న హైదరాబాద్ లో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు చెప్పారు. మోదీ సర్కార్ వక్ఫ్ భూములను దోచుకునేందుకు కుట్ర చేస్తోందన్నారు.

New Update

వక్ఫ్ బిల్లుపై ఎంఐఎం చీఫ్‌, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఈ మేరకు ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు.  కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 23, 26 ను అడ్డుపెట్టుకుని వక్ఫ్ భూములను దోచుకునే కుట్ర చేస్తోందని మండిపడ్డారు. టీటీడీలో కేవలం హిందువులను మాత్రమే ఉద్యోగులుగా కొనసాగిస్తోన్న ఏపీ సీఎం చంద్రబాబు.. మరి వక్ఫ్‌ బోర్డ్ లో ఇతర మతాలకు చెందిన వారిని ఉండేలా రూపొందించిన వక్ఫ్‌ బిల్లును ఎలా సపోర్ట్ చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ నెల 19న ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సభకు దేశ నలుమూలల నుంచి మత పెద్దలు, రాజకీయ పార్టీల నేతలు హాజరుకానున్నట్లు  చెప్పారు. ఆయన పూర్తి ప్రెస్ మీట్ ను పై వీడియోలో చూడండి.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు