Municipal Election Results 2026 :చైర్మన్ పదవి ఇస్తేనే సపోర్ట్.. జనగామలో చుక్కలు చూపిస్తున్న ఇండిపెండెంట్!

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. అధికార కాంగ్రెస్ జైత్రయాత్ర కొనసాగిస్తుండగా..  ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు గట్టిగానే పోటీ ఇస్తున్నాయి.

New Update
janagon

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. అధికార కాంగ్రెస్ జైత్రయాత్ర కొనసాగిస్తుండగా..  ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు గట్టిగానే పోటీ ఇస్తున్నాయి. ఫలితాల్లో భాగంగా జనగామ కౌంటింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్,  బీఆర్ఎస్ సమాన స్థానాలను కైవసం చేసుకోవడంతో, అధికారం దక్కించుకోవడానికి స్వతంత్ర అభ్యర్థి మద్దతు కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో గెలిచిన స్వతంత్ర అభ్యర్థి మారబోయిన పాండును తమ వైపు తిప్పుకునేందుకు ఇరు పార్టీల నాయకులు కౌంటింగ్ కేంద్రం వద్దే పోటీ పడ్డారు. ఆయనను తమ వెంట తీసుకెళ్లేందుకు ఇరు వర్గాలు ప్రయత్నించడంతో అక్కడ హై టెన్షన్ నెలకొంది.

మారబోయిన పాండు సంచలన వ్యాఖ్యలు

ఈ క్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈ క్రమంలో స్వతంత్ర అభ్యర్థి మారబోయిన పాండు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు చైర్మన్ పదవి ఇస్తేనే ఏ పార్టీకైనా మద్దతు ఇస్తానని ఆయన తెగేసి చెప్పారు. ఫలితాలు సమానంగా రావడంతో పాండు డిమాండ్ ఇప్పుడు ఇరు పార్టీలకు పెద్ద తలనొప్పిగా మారింది. ఏ పార్టీ ఆయన ప్రతిపాదనకు తలొగ్గి మున్సిపల్ పీఠాన్ని దక్కించుకుంటుందోనని స్థానికంగా ఆసక్తికర చర్చ జరుగుతోంది.

Advertisment
తాజా కథనాలు