తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

TG: కోఠిలోని మహాత్మాగాంధీ స్మారక నిధికి చెందిన 5.34 ఎకరాలను ప్రైవేట్ వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్ చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో 6వారాల్లోగా కౌంటర్లు దాఖలు చేయాలని తెలిపింది.

New Update
high court 2

Telagana High Court: హైదరాబాద్ కోఠిలోని మహాత్మాగాంధీ స్మారక నిధికి చెందిన 5.34 ఎకరాలను ప్రైవేట్ వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్ చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో ఆరు వారాల్లోగా కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతి వాదులైన సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, భూపరిపాలన ప్రధాన కమిషనర్, సిద్దిపేట జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్ మరికొందరిని ఆదేశించింది. సిద్ధిపేట జిల్లా సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల గ్రామంలోని గాంధీ స్మారక నిధికి చెందిన భూమి అన్యాక్రాంతమైందంటూ గ్రామానికి చెందిన తుపాకుల బాలరంగం తదితరులు ఈ పిటిషన్ వేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 2022 ఆగస్టు 6న చట్ట వ్యతిరేకంగా చేసిన ఆ రిజిస్ట్రేషను రద్దు చేయాలని కోరారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు