Telangana: భారీ వర్షం..7 కి.మీ మేర ట్రాఫిక్‌ జామ్‌!

సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గణేశ్ గడ్డ వద్ద నుంచి పటాన్‌ చెరు వరకు భారీగా ట్రిఫిక్‌ జామ్‌ అయ్యింది. దాదాపు 7 కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

rain
New Update

Telangana: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సంగారెడ్డి జిల్ఆలో భారీ వర్షంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గణేశ్ గడ్డ వద్ద నుంచి పటాన్‌ చెరు వరకు భారీగా ట్రిఫిక్‌ జామ్‌ అయ్యింది. దాదాపు 7 కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. గంటల తరబడి వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

Also Read:  మహిళలకు గుడ్‌న్యూస్.. ఆరోజు నుంచే ఫ్రీ బస్ అమలు

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. తీవ్ర అల్పపీడనం పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ మంగళవారం సాయంత్రం వాయుగుండం బలపడింది. ఇది తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీలోని దక్షిణ కోస్తా తీరాల వైపు కదులుతోందని , ఇది గురువారం పుదుచ్చేరి , నెల్లూరు మధ్య తీరాన్ని తాకవచ్చని వాతావరణశాఖ తెలిపింది.

Also Read:  విమానాల్లో స్కై మార్షల్ పెంపు..పౌరవిమానయానశాఖ నిర్ణయం

దీని ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమలో రేపు  కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, మిగిలిన చోట్ల అక్కడక్కడ మోస్తరు వర్షాలు, ఎల్లుండి కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. 

పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, వైఎస్సార్‌, చిత్తూరు జిల్లాల్లో ఆకస్మిక వరదలకు ఆస్కారముందని తెలిపింది. బుధ, గురువారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని, గరిష్ఠంగా గంటకు 60 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు స్టెల్లా తెలిపారు. పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.

Also Read:  తీవ్ర అల్పపీడనం..రేపు తీరం దాటనున్న వాయుగుండం!

మంగళవారం ఉదయం నెల్లూరులో అత్యధిక వర్షపాతం కావలిలో 15 సెం.మీగా నమోదైంది. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంతో ఆంధ్ర ప్రదేశ్ హోం మంత్రి అనిత  ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లాల యంత్రాంగాన్ని సంసిద్ధంగా ఉంచాలని హోం మంత్రి సూచించారు. సహాయక చర్యల నిమిత్తం ఇప్పటికే ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధంగా ఉంచినట్టు ఆమె తెలిపారు. 

Also Read:  తిరుపతి భక్తులకు అలర్ట్.. ఆ మార్గం మూసివేత

తాడేపల్లి విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలోనే ఉండి జిల్లా కలెక్టర్లకు ఎప్పటికప్పుడు ఆదేశాలిస్తున్నారు. దీంతో పాటూ చిత్తూరు, కర్నూలు, నెల్లూరు, నంద్యాల, తిరుపతి, ప్రకాశం జిల్లాలలోని ప్రతి మండలంలో కమాండ్ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామని చెప్పారు. మత్స్యకారులు, రైతులు, గొర్రెల కాపరులు తుపాను ప్రభావం ఉన్నంత వరకూ బయటికి వెళ్లకూడదని హోం మంత్రి విజ్ఞప్తి చేశారు.

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe