New Electricity Charges : వినియోగదారులకు గుడ్​న్యూస్​! - కరెంట్​కనెక్షన్​లో కొత్త నిబంధనలు

నూతన విద్యుత్‌ కనెక్షన్‌ల విషయంలో తెలంగాణ రాష్ట్ర విద్యుత్​ నియంత్రణ మండలి ఈఆర్​సీ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కనెక్షన్‌ తీసుకునే వినియోగదారుల అంచనాలు తయారు చేసే నిబంధనలను ఈఆర్​సీ పూర్తిగా రద్దు చేసింది.

New Update
FotoJet (16)

Telangana State Electricity Regulatory Board

New Electricity Charges : నూతన విద్యుత్‌ కనెక్షన్‌ల విషయంలో తెలంగాణ రాష్ట్ర విద్యుత్​ నియంత్రణ మండలి ఈఆర్​సీ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కనెక్షన్‌ తీసుకునే వినియోగదారుల అంచనాలు తయారు చేసే నిబంధనలను ఈఆర్​సీ పూర్తిగా రద్దు చేసింది. ఈఆర్​సీ ఆదేశాల మేరకు కొత్త నిబంధనలను గురువారం నుంచి అమలు చేయాలని విద్యుత్​ పంపిణీ సంస్థలు డిస్కంలు నిర్ణయించాయి. గతంలో ఎవరైనా కొత్త కరెంట్‌ కనెక్షన్ తీసుకోవాలంటే కొందరు విద్యుత్​ శాఖ ఉద్యోగులు తమకు ఇష్టమైన కాంట్రాక్టర్లను రంగంలోకి దించి అంచనా వ్యయం పేరుతో డబ్బులు డిమాండ్​ చేస్తు్న్నారు. దీంతో వారు సాగిస్తున్న దందాలకు అడ్డుకట్ట వేస్తూ తెలంగాణ రాష్ట్ర విద్యుత్​ నియంత్రణ మండలి ఈఆర్​సీ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిబంధనలను గురువారం నుంచి అమలు చేయాలని విద్యుత్​ పంపిణీ సంస్థలు డిస్కంలు నిర్ణయించడం గమనార్హం.

 ఈ మేరకు కొత్త మార్గదర్శకాలు జారీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  కొత్త కనెక్షన్లు, అదనపు లోడ్​ జారీకి మార్పులు చేస్తూ విద్యుత్‌ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి 2015లో విద్యుత్తు నియమావళికి ఒకసారి సవరణ చేయగా మళ్లీ పదేళ్ల తర్వాత మరో కీలక సవరణ చేసినట్లు ఈఆర్​సీ వివరించింది. కొత్త నిబంధనల ప్రకారం రాష్ట్రంలో ఎవరైనా కొత్త కరెంటు కనెక్షన్​ కావాలని డిస్కంకు దరఖాస్తు చేయగానే వెంటనే కనెక్షన్​ అందించాలి. అంచనా వ్యయం వేశామని, అది మొత్తం చెల్లించాలని వినియోగదారులను ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్​ సిబ్బంది డబ్బులు అడగకూడదు.

మార్గదర్శకాల్లో  ముఖ్యాంశాలు

ఇప్పటివరకు ఏదైనా అపార్టుమెంటులో ఫ్లాట్​ లేదా వాణిజ్య భవనంలో కొంతభాగం కొన్నవారి నుంచి బిల్డర్లు డెవలప్​మెంట్​ ఛార్జీ పేరుతో వారికి తోచినట్లు కరెంటు కనెక్షన్​కు కొత్త ట్రాన్స్​ఫార్మర్​ ఏర్పాటు వ్యయం పేరుతో వసూలు చేస్తున్నారు. ఇక మీదట అలా చేయడానికి వీల్లేదు.

అపార్టుమెంట్లు, వాణిజ్య భవనాలకు ప్రత్యేక ట్రాన్స్​ఫార్మర్​ డబ్బుని ఇక నేరుగా డిస్కంలు వసూలు చేయడానికి కుదరదు. ఆ భవనంలో మొత్తం ఫ్లాట్లు, లిఫ్ట్​, వాటర్​ కనెక్షన్​ వంటి కామన్​ వినియోగానికి కలిపి ఎన్ని కరెంటు కనెక్షన్లు ఇస్తున్నారు. వాటి మొత్తం లోడు ఎంత అనేది లెక్కించాల్సి ఉంటుంది. దీని ప్రకారం ప్రతి కిలోవాట్​కు రూ.10 వేల చొప్పున డిస్కంకు చెల్లించాల్సి ఉంటుంది. అదనంగా మరో రూ. 10 వేల చొప్పున డిస్కంకు కట్టాలి. అదనంగా మరో రూ. 200 చొప్పున సెక్యూరిటీ డిపాజిట్​ కట్టాలి. వాణిజ్య భవనాలకూ ఇవే నిబంధనలు వర్తిస్తాయి. ఈ ఎమౌంట్‌ కట్టిన అపార్టుమెంట్లకు ట్రాన్స్​ఫార్మర్​ను డిస్కం నేరుగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దానికి అదనంగా ఏమీ వసూలు చేయరాదు. ఒకవేళ వినియోగదారుడి వ్యయంతో ప్రత్యేక ట్రాన్స్​ఫార్మర్​ను ఏర్పాటు చేస్తే దాన్ని డిస్కం నిర్వహించాలి. దాని నుంచి ఇతర వినియోగదారులకు కనెక్షన్లు ఇవ్వకూడదు.

కొత్తగా ప్లాట్లు వేసే రియల్​ఎస్టేట్​ వ్యాపారులు ట్రాన్స్​ఫార్మర్​ ఏర్పాటు అయ్యే ఖర్చుని వారే భరించాలి. పొలంలో కొత్తగా బోరు వేయించిన రైతు కరెంటు కనెక్షన్​కు దరఖాస్తు చేస్తే కిలోవాట్​కు రూ.వెయ్యి చొప్పున మాత్రమే డిస్కం వసూలు చేయాలి.

ఎలక్ట్రిక్​ వాహనాల ఛార్జింగ్​ స్టేషన్​ ఏర్పాటు చేసుకుంటే 20 కిలోవాట్లలోపు అయితే రూ.3,400 అంతకు మించితే రూ. 8 వేల చొప్పున రుసుం చెల్లించాలి.20 కిలోవాట్ల వరకు సర్వీస్​ లైన్​ ఛార్జీలతోపాటు డెవలప్​మెంట్​ ఛార్జీలను డిస్కంలు వసూలు చేస్తాయి. 20 కిలోవాట్లు దాటితే కేవలం సర్వీస్​ లైన్​ ఛార్జీలు మాత్రమే వసూలు చేస్తాయి. ఇప్పటికే అమల్లో ఉన్న డెవలప్​మెంట్​ ఛార్జీలు కిలోవాట్​కు ఇంటి అవసరాలకు రూ.1,646 వాణిజ్య అవసరాలకు రూ. 2,275 ఖర్చు అవుతున్నాయి.

గృహ విభాగంలో ఇంటి విస్తీర్ణం ఆధారంగా కనీస లోడ్​ను నిర్ణయించారు. 500 చదరపు అడుగుల విస్తీర్ణంలోపు ఉన్న ఇంటికి/ఫ్లాట్​కు కనీసం 2 కిలోవాట్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఒక ప్లాట్​ కొనుగోలు ముందుగా దానికి ఉన్న కరెంటు కనెక్షన్​ లోడు ఎంత అనేది చెక్​ చేసుకోవాలి. దానికి ఉదాహరణకు 3 కిలోవాట్ల లోడుతో కనెక్షన్​ బిల్డర్​ ముందే తీసుకుని ఉంటే రూ.30,600 మాత్రమే అతనికి ఇవ్వాలి. అదనంగా కామన్​ కనెక్షన్​ లోడు 10 కిలోవాట్ల కనెక్షన్​కు బిల్డర్​ డిస్కంకు చెల్లించిన రూ.1,02,000ను మొత్తం 30 ఫ్లాట్లకు సమానంగా పంచితే ఒక ఫ్లాట్​కు రూ.3,400 అవుతుంది. ఇది మాత్రమే బిల్డర్​కు అదనంగా చెల్లించాలి. అంటే ఆ ఫ్లాట్​కు మొత్తం రూ.34 వేలు మాత్రమే బిల్డర్​కు ఇవ్వాలి. ఒకవేళ అపార్టుమెంటు లేదా వాణిజ్య భవనంలోని అన్ని కనెక్షన్ల లోడు 20 కిలోవాట్లలోపు ఉంటే రూ.4,600 చొప్పున ఒక్కో కిలోవాట్​కు కట్టాలి.

రైతులు ఎక్కువగా బోరుకు 5 హెచ్​పీ కరెంటు మోటారు  వాడతారు. దీనికి సాధారణంగా 3.8 కిలోవాట్ల లోడు కరెంటు కనెక్షన్​ తీసుకుంటారు. దీనికి రూ.3,800 చెల్లిస్తే సరిపోతుంది. ఇది కాకుండా కిలోవాట్​కు మరో రూ.1,200 డెవలప్​మెంట్​ రుసుం తీసుకుంటారు. అంతేకాకుండా అవుట్​ రైట్​ కంట్రిబ్యూషన్​ (ఓఆర్​సీ) పేరుతో అదనంగా  వసూలు చేస్తున్న రుసుములన్నీ ఇక మీదట నిలిపివేయాలని ఈఆర్​సీ స్పష్టం చేస్తూ తీర్పునిచ్చింది.

Advertisment
తాజా కథనాలు