నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అమ్మవారి విగ్రహం ధ్వంసం

TG: హైదరాబాద్ నాంపల్లి ఎక్సిబిషన్ గ్రౌండ్స్‌లో ఓ ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు బేగంబజార్ పోలీసులు. ఈ దాడిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

HYD NAM
New Update

HYDERABAD: హైదరాబాద్, నాంపల్లి ఎక్సిబిషన్ మైదానంలో నెలకొల్పిన అమ్మవారి విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న బేగంబజార్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ప్రతి సంవత్సరం అమ్మవారి విగ్రహాన్ని ఎక్సిబిషన్ సొసైటీ, సిబ్బంది ఆధ్వర్యంలో నెలకొలుపుతారు.

 

అర్థరాత్రి ఎవరు లేని...

నిన్న రాత్రి దండియా ప్రోగ్రాం పూర్తి అయ్యే వరకు ఎక్సిబిషన్ గ్రౌండ్ లొనే పోలీసులు ఉన్నారు. అర్థరాత్రి ఎవరు లేని సమయం చూసి మొదటగా  కరెంట్ కట్ చేసి, సీసీ కెమెరాలు విరగగొట్టిన అనంతరం విగ్రహం చేతిని విరగకొట్టి, పూజ సమాన్ అంత చుట్టూ పడవేసి, అమ్మవారి చుట్టూ ఉన్న బరికేడ్స్ కూడా దుండగులు తొలిగించారు. సంఘటన స్థలానికి చేరుకున్న అబిడ్స్ ఏసీపీ చెంద్ర శేఖర్.. కేసు నమోదు చేసుకుని బేగంబజార్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ప్రతి సంవత్సరం ఎక్కడో ఒక వద్ద హిందు ఆరాధ్య విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని భక్తుల ఆవేదనతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విగ్రహం పై దాడి చేసిన దుండగులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని పలు హిందు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe