/rtv/media/media_files/2024/11/26/ZOLn4o8caLt3ZjXga4kL.jpg)
fire accident
TS News: హైదరాబాద్ శివారులోని జీడిమెట్ల ఆరోరా పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రియాక్టర్‌లో కెమికల్ మిక్స్ చేస్తుండగా ఈ దారుణ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో సూరారానికి చెందిన అనిల్ కుమార్ అనే కార్మికుడు మృతి చెందాడు. మరో ముగ్గురు కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన కార్మికులను సికింద్రాబాద్ యశోద హాస్పిటల్‌కు తరలించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న బంధువులకు కంపెనీ దగ్గరకు చేరుకున్నారు. అయితే ప్రమాదంపై బాధిత బంధువులకు సమాచారం ఇవ్వడం లేదు కంపెనీ సిబ్బంది.
ఆరోరా పరిశ్రమలో..
ఘటనపై సమాచారం అందుకున్న సూరారం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ సిబ్బంది ఎందుకు సమాచారం ఇవ్వకపోవటంతో యాజమాన్యంపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.దూలపల్లిలో ఉన్న ప్లాస్టిక్ తయారీ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మొదటగా 3వ అంతస్తులో వ్యాప్తించిన మంటలు.. క్రమంగా 2వ ఫ్లోర్‌లోకి అంటుకున్నాయి. ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది. రెండు ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పేందుకు యత్నిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
గతంలో..
గతేడాది మార్చిలో ఆరోరా ఫార్మాస్యూటికల్స్ కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ పరిశ్రమలో రియాక్టర్ పేలి మంటలు చెలరేగాయి. ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఎంతో శ్రమించి మంటలను అదుపులోకి తీసుకోచ్చారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించిన కార్మికులు రవీందర్‌రెడ్డి(25), కుమార్(24)గా గుర్తించారు పోలీసులు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం.
— Warrior YSRCP 🔥 🔥 🔥 (@Vamsee007) November 26, 2024
ప్లాస్టిక్ బ్యాగుల తయారీ పరిశ్రమలో మంటలు.. మంటలార్పుతున్న ఫైర్ సిబ్బంది.#fireaccident#Hyderabad
pic.twitter.com/DY82Lnhlec
జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం
— Telugu Galaxy (@Telugu_Galaxy) November 26, 2024
ప్లాస్టిక్ బ్యాగులు తయారయ్యే పరిశ్రమలో అగ్ని ప్రమాదం
మంటలార్పుతున్న ఫైర్ సిబ్బంది#Telangana#Hyderabad#BRS#KTR#Congress#RevanthReddy#BJPpic.twitter.com/09HefaB1OP
Follow Us