/rtv/media/media_files/2025/03/19/06hvCVKfVa8oAdosBpHX.jpg)
హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ లో సంచలనం సృష్టించిన అప్సర హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ హత్య కేసులో ఇరువైపులు వాదనలు పూర్తి అయ్యాయి. నిందితుడు పూజారి సాయికృష్ణకు రంగారెడ్డి కోర్టు జీవిత ఖైదు విధించింది. అంతేకాకుండా సాక్ష్యాలు తారుమారు చేసినందుకు మరో ఏడేళ్ల పాటు శిక్షను విధించింది కోర్టు. బాధితురాలి కుటుంబానికి రూ. 10లక్షల పరిహారం ప్రకటించింది కోర్టు.
Also read : తెల్లటి పటికతో ముఖాన్ని తెల్లగా మార్చుకోండి..ఇలా చేయండి
అప్సరతో పరిచయం, వివాహేతర సంబంధం
సరూర్‌నగర్ ప్రాంతానికి చెందిన పూజారి సాయికృష్ణకు అప్సరతో పరిచయం ఏర్పడింది. ఇది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. సాయికృష్ణకు ఇప్పటికే పెళ్లి కాగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే తనను పెళ్లి చేసుకోవాలని సాయికృష్ణను అప్సర ఒత్తిడి చేయడంతో సహనం కోల్పోయిన సాయి .. గోవాకు వెళ్దామని అప్సరను నమ్మించి కారులో తీసుకెళ్లాడు.శంషాబాద్‌లోని సుల్తాన్‌పల్లికి వెళ్లాక అప్సరను అక్కడే చంపేసి అదే కారులో తీసుకొచ్చి సరూర్‌నగర్ లో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కాలేజీ వద్ద మ్యాన్‌హోల్‌లో పడేశాడు.
Also read : థియేటర్లో మొత్తం మ్యాడ్, మ్యాడ్.. 'MAD Square' ట్రైలర్ చూశారా!
సీసీటీవీ ఫుటెజ్ ఆధారంగా
అనంతరం తనకు ఏమీ తెలియదన్నట్లుగా అప్సర కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీటీవీ ఫుటెజ్ ఆధారంగా పోలీసులు కేసును ఛేదించి సాయికృష్ణను అదుపులోకి తీసుకున్నారు. అప్సర గర్భం దాల్చింది అందుకు తానే కారణమని పెళ్ళిచేసుకోవాలని ఒత్తిడి చేసిందని సాయికృష్ణ విచారణలో వెల్లడించాడు. కానీ ఆమె వేరేవాళ్లతో కూడా సన్నిహితంగా ఉండేదని ఇవన్నీ భరించలేకే హత్య చేశానని తెలిపాడు. అప్సర మొదటిసారి గర్భవతి అయినప్పుడు సాయికృష్ణ అబార్షన్ చేయించాడు...అయితే రెండోసారి కూడా గర్భం దాల్చిడంపై సాయికృష్ణకు అనుమానం నెలకొందని.. గర్భం పైనే వివాదం జరిగినట్లుగా సాయికృష్ణ వెల్లడించాడు.
Also read: NTR: ''అమ్మలు హ్యాపీ బర్త్ డే'' భార్యకు ఎన్టీఆర్ విషెస్.. ఫొటోలు వైరల్
Also read : Bhatti Vikramarka : కేటీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు .. భట్టి వార్నింగ్!