సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ ఎంపీ కేవీపీ సంచలన లేఖ

TG: బఫర్ జోన్‌లో తన ఫామ్ హౌస్ ఉందంటూ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌కు కేవీపీ రామచంద్రరావు లేఖ రాశారు. తన ఫామ్‌హౌస్‌లో నిర్మాణాలు FTL, బఫర్‌ జోన్‌ ఉంటే 48 గంటల్లో తన సొంత ఖర్చులతో తానే కూలుస్తా అని లేఖలో పేర్కొన్నారు.

New Update
KVP

KVP Vs Revanth: సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ ఎంపీ కేవీపీ సంచలన లేఖ రాశారు. నిన్న కేవీపీకి హైదరాబాద్ లో ఫామ్‌హౌస్‌ ఉందని అన్నారు. కేవీపీ ఫామ్‌హౌస్‌ను కూల్చాలా, వద్దా అంటూ సీఎం ప్రశ్నలు కురిపించారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డికి కేవీపీ రామచంద్రరావు లేఖ రాశారు. సీఎం గారూ అజీజ్‌నగర్‌లోని మా ఫామ్‌హౌస్‌కి  మీ అధికారులను పంపి సర్వే చేయించండి అని అన్నారు.

నేనే కూలుస్తా..

చట్టప్రకారం FTL, బఫర్‌ జోన్ల పరిధిని మార్క్‌ చేయించండి అని చెప్పారు. మా ఫామ్‌హౌస్‌లో నిర్మాణాలు FTL, బఫర్‌ జోన్‌ ఉంటే 48 గంటల్లో తన సొంత ఖర్చులతో తానే కూలుస్తా అని అన్నారు. మార్కింగ్‌ ప్రక్రియ పారదర్శకంగా జరగాలని సూచించారు. మార్కింగ్‌ తేదీని ముందే చెప్పాలని కోరారు. తనపై కొందరు చేస్తున్న విమర్శల వల్ల కాంగ్రెస్‌ పార్టీకి నష్టం జరగకూడదు అని ఆయన లేఖలో పేర్కొన్నారు.

Advertisment
తాజా కథనాలు