Telangana: ప్రాణం ఉండగానే శ్మశాన వాటికకు.. తెలంగాణలో దారుణం!

రాజన్న సిరిసిల్ల జిల్లాలో తంగళ్లపల్లి మండల కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. చావు బతుకుల్లో ఉన్న కూకట్ల రాజవ్వ(75) అనే వృద్ధురాలిని కుటుంబ సభ్యులు శ్మశానవాటికలో వదిలేశారు. దీంతో విషయం తెలుసుకున్న అధికారులు బాధితురాలిని వృద్ధాశ్రమంలో చేర్చారు.

rajanna
New Update

Rajanna Sirisilla: మాయమైపోతున్నాడు మనిషన్న వాడు అనే వాక్యం రోజురోజుకి నిజమైపోతుంది. బతికుండగానే ఓ వృద్దురాలిని బంధువులు శ్మశానంలో పడేసిన దారుణ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన ప్రకారం.. తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన కూకట్ల రాజవ్వ(75) శానిటేషన్  కార్మికురాలిగా పని చేసింది. 

Also Read: లోయలో పడ్డ ఆర్టీసీ బస్సు

శ్మశానంలో పడేసి..

కొంతకాలం క్రితం ఆమె భర్త మరణించాడు. పిల్లలు లేకపోవడంతో ఆమె తన అన్న ఇంట్లో ఉంటుంది. కొద్ది రోజుల కింద రాజవ్వ అనారోగ్యంతో మంచం పట్టింది. దీంతో  మేనల్లుడు తిరుపతి  ఆమెను తీసుకుని వెళ్లి శ్మశానంలో పడేసి వెళ్లిపోయాడు. గ్రామస్తులు రాజవ్వ పరిస్థితి తెలుసుకుని మంగళవారం మేనల్లుడిని నిలదీయగా.. ఆమె సోదరి పిల్లలు తాము చూసుకుంటామని తీసుకెళ్లారని.. అయితే.. శ్మశానంలో వదిలేసి వెళ్లారని చెప్పాడు. 

Also Read:  బ్రెయిన్ డెడ్‌ అయిన యువతి చికిత్స పొందుతూ  మృతి

ఇలా బతికుండగానే అన్న, సోదరి పిల్లలు శ్మశానానికి చేర్చిన ఘటన  స్థానికులను కలచివేసింది. ఈ విషయం గురించి స్థానికులు పోలీసులకు తెలియడంతో వారు గ్రామానికి చేరుకుని ఆరా తీశారు. రాజవ్వ బంధువులతో మాట్లాడి ఆమె బాగోగులు చూసుకునేలా ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. లేదంటే ఏదైనా వృద్ధాశ్రమంలో చేర్పించే అవకాశాలు కనపడుతున్నాయి.

పెళ్లి కావడం లేదని తండ్రిని ..

పిల్లల్ని కనడం ఒకెత్తయితే.. వారిని పెంచి పోషించడం మరో ఎత్తు. ఎన్ని కష్టాలు పడినా.. తల్లిదండ్రులు తమ పిల్లలు బాగుండాలనే కోరుకుంటారు. వారు పడ్డ కష్టాలు వారి పిల్లలు పడకూడదని ఎంతటి కష్ట నష్టాన్నైనా భరిస్తారు. వారున్నంత వరకు తమ పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకుంటారు. పిల్లలకు ఏ చిన్న కష్టం వచ్చినా విలవిల్లాడిపోతారు. కానీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల్నే కడతేర్చేందుకు కొందరు వెనుకాడటం లేదు. ఆస్తి కోసమో లేక మరేదైన విషయంలో తల్లిదండ్రులతో గొడవ పడి వారిని కడతేర్చుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. 

తండ్రి తీరుతో తనకు పెళ్లి కావడం లేదన్న ఆలోచన ఒకవైపు.. ఆస్తి దక్కించుకునే ఆలోచన మరోవైపు ఇలాంటి దుర్భుద్దితో ఓ కొడుకు తన తండ్రిని హత్య చేశాడు. ఈ ఘటన మరెక్కడో జరగలేదు.. నిజామాబాద్ జిల్లా నవీపేడ మండలం అనంతగిరిలో వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

అనంతగిరికి చెందిన గౌరు అమృతం (54) పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతడికి మహిపాల్, మనోజ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అతడి భార్య తనతో విభేదాలు పెట్టుకుని చాలా ఏళ్ల క్రితమే పిల్లల్ని తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. అయితే కుమారులిద్దరూ బతుకుదెరువు కోసం కొంత కాలం కిందట దుబాయ్ వెళ్లారు. ఇక అక్కడ పని చేస్తూ పదిరోజుల క్రితం తన తండ్రి చనిపోయాడని అబద్దం చెప్పి.. అక్కడనున్న వారిని నమ్మించి పెద్ద కుమారుడు మహిపాల్ ఇండియాకు తిరిగి వచ్చేశాడు. 

అనంతరం తన తండ్రి వద్దకు వెళ్లి ఉంటున్నాడు. అదే క్రమంలో ఆదివారం తండ్రీ కొడుకు కలిసి ఇంట్లో మద్యం తాగారు. మత్తులో ఉండటంతో తండ్రి అమృతం మెడకు టవల్ ను చుట్టి గొంతునులి హత్య చేశాడు. సోమవారం తన తండ్రికి బాలేదని ఓ ఆర్ఎంపీని రప్పించి ఆరోగ్యం బాలేక చనిపోయినట్లు క్రియేట్ చేశాడు. గ్రామస్థులకు సైతం అదే నమ్మించాడు. ఇక అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా.. అమృతం సోదరి మెడపై ఉన్న గాయాలను చూసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అసలు నిజాన్ని బయటపెట్టారు. 

మహిపాల్ ను విచారించగా.. తాను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. అమ్మతో వేరుగా ఉండటం.. అలాగే తరచూ మద్యం తాగుతండటం కారణంగానే తనకు పెళ్లి కావడం లేదని అన్నాడు. అందువల్లనే తండ్రిపై కక్ష్య పెంచుకున్నట్లు తెలిపాడు. అతేకాకుండా తండ్రి పేరిట ఉన్న ఆస్తులు, ప్లాటు అమ్మి తల్లి పేరుతో అనంతగిరిలో ఇల్లు కట్టుకోవాలనే ఉద్దేశంతోనే హత్య చేసినట్లు అంగీకరించాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Also Read: యాదగిరిగుట్టపై ఫొటోలు, వీడియోలు నిషేధం: ఈవో

Also Read: స్టార్ హీరోయిన్‌ కి బలవంతంగా ముద్దుపెట్టిన హీరో!

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe