/rtv/media/media_files/2026/01/16/tg-crime-2026-01-16-18-06-33.jpg)
TG Crime
TG Crime: తెలంగాణలో ధరణి, భూ భారతి అక్రమ రిజిస్ట్రేషన్ కుంభకోణం పై పెద్ద రచ్చ జరుగుతోంది. వరంగల్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ప్రకటించిన వివరాల ప్రకారం, ఈ ఘటనలో 15 మందిని పోలీసులు అరెస్టు చేశారు, ఇంకా 9 మంది పరారీలో ఉన్నారు. ప్రధాన నిందితులుగా బసవరాజు, జెల్లా పాండును గుర్తించారు.
జనగామ, యాదాద్రి జిల్లాల్లో అక్రమంగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. యాదగిరిగుట్టలోని ఆన్‌లైన్ సర్వీస్ సెంటర్ల ద్వారా మోసాలు జరిగి, ప్రభుత్వానికి రూ.3.90 కోట్ల నష్టం చోటు చేసుకుంది. పోలీసులు నిందితుల నుంచి రూ.63.19 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు, బ్యాంక్ ఖాతాల్లోని రూ.1 లక్ష సీజ్ చేశారు.
అత్యంత విలువైన ఆస్తి పత్రాలు, కార్లు, ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్, సెల్‌ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. ధరణి-భూ భారతి కేసులో మరిన్ని అరెస్టులు జరగవచ్చు అని అధికారులు హెచ్చరించారు.
Follow Us