కొండాసురేఖపై పరువునష్టం కేసు.. విచారణ వాయిదా

TG: నాగార్జున పరువునష్టం కేసు నాంపల్లి ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. కొండా సురేఖ తరఫున న్యాయవాది గురుమిత్‌సింగ్‌ హాజరయ్యారు. నాగార్జున పరువునష్టం దావా కేసుతో పాటు కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌ను నవంబర్‌ 13కు కోర్టు వాయిదా వేసింది.

Konda Surekha : వారం రోజులుగా డెంగీతో బాధపడుతున్నా.. అర్థం చేసుకోండి: కొండా సురేఖ
New Update

Konda Surekha: తెలంగాణ రాజకీయాలతో పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టించిన మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై హీరో నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసును ఈరోజు నాంపల్లి ప్రత్యేక కోర్టు విచారణ చేపట్టింది. కొండా సురేఖ తరఫున న్యాయవాది గురుమిత్‌సింగ్‌ హాజరయ్యారు. నాగార్జున పరువునష్టం దావా కేసుతో పాటు కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌ను నవంబర్‌ 13కు కోర్టు వాయిదా వేసింది. కాగా తాను చేసిన వ్యాఖ్యలనుఈ వెనక్కి తీసుకుంటున్నట్లు కొండా సురేఖ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.

కొండాపై కోర్టు ఆగ్రహం....

ఇటీవల కొండా సురేఖ తనపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ మాజీ మంత్రి  కేటీఆర్ దాఖలు చేసిన 100 కోట్ల పరువు నష్టం కేసులో కోర్టు మంత్రి కొండా సురేఖకు ఊహించని షాక్ తగిలింది. ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయంటూ కోర్టు మంత్రిపై  మండిపడింది. ఓ బాధ్యత గల మహిళ మంత్రి ఇలాంటి కామెంట్స్ చేయటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని చెప్పింది. కేటీఆర్ పై కొండా సురేఖ వ్యాఖ్యలను హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు సీరియస్ అయింది. 

భవిష్యత్ లో ఇంకెప్పుడూ ఇలాంటి వ్యాఖ్యలను కేటీఆర్ తో సహా ఏ ఇతర నేతలపై చేయవద్దని కొండాను సురేఖను ఆదేశించింది. కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలను వెంటనే మీడియా, సోషల్ మీడియా, వెబ్ సైట్లు, అన్ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ నుంచి తొలగించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. యూట్యూబ్, ఫేస్ బుక్, గూగుల్ సంస్థలకు కూడా ఈ వ్యాఖ్యలు  ఉన్న వీడియోలను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.

కొండా సురేఖ వ్యాఖ్యలను ప్రసారం చేసిన, కథనాలు ప్రచురించిన మీడియా సంస్థలకు కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ కామెంట్లకు సంబంధించిన అన్ని కథనాలను సోషల్ మీడియా నుంచి తొలగించాలని ఆయా సంస్థలను కోరింది. కొండా సురేఖ వ్యాఖ్యలు సమాజంలో చెడు ప్రభావాన్ని చూపుతాయని ఆమె వ్యాఖ్యలకు సంబంధించిన అన్ని కథనాలు, వీడియోలు పబ్లిక్ డొమైన్ లో ఉండవద్దని కోర్టు స్పష్టం చేసింది. కాగా గతంలో కూడా  కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఇలాంటి వ్యాఖ్యలు తగదు అని హెచ్చరించింది .

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe