/rtv/media/media_files/2024/12/26/pdNlHtCAK0lWj3PBWOup.jpg)
Hyderabad Madapur Traffic DCP
హైదరాబాద్ లో అత్యంత కీలక ప్రాంతమైన మాదాపూర్ ప్రాంత ట్రాఫిక్ డీసీపీగా టీ సాయి మనోహర్ ను ఇటీవల పోలీస్ శాఖ నియమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా పని చేస్తానన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేస్తానన్నారు. డీసీపీగా బాధ్యతలు స్వీకరించిన మనోహర్ కు పోలీస్ అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు
సాయి మనోహర్ విషయానికి వస్తే.. 1996లో ఎస్ఐగా ఆయన పోలీస్ శాఖలోకి ప్రవేశించారు. అనంతరం 2008లో సీఐగా పదోన్నతి పొందారు. ఆ తర్వాత 2013లో డీఎస్పీగా ఆయనకు మరో ప్రమోషన్ లభించింది. మనోహర్ సేవలను గుర్తించిన ప్రభుత్వం 2022లో అడిషనల్ డిప్యూటీ కమిషనర్ గా నియమించింది. తాజాగా ఈ నెల 16న డీసీపీగా పదోన్నతి కల్పించింది. సాయి మనోహర్ నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (OSD)గా సైతం పని చేశారు.