Municipal election results 2026: నందికొండ మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం

నల్గొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ తన విజయకేతనాన్ని ఎగురవేసింది. తాజా ఫలితాల ప్రకారం, ఇక్కడ హస్తం పార్టీ ఏకపక్ష విజయాన్ని నమోదు చేసి మున్సిపాలిటీని తన కైవసం చేసుకుంది.

New Update
congress


నల్గొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ తన విజయకేతనాన్ని ఎగురవేసింది. తాజా ఫలితాల ప్రకారం, ఇక్కడ హస్తం పార్టీ ఏకపక్ష విజయాన్ని నమోదు చేసి మున్సిపాలిటీని తన కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో నందికొండ మున్సిపాలిటీలోని మొత్తం 12 వార్డులకు గానూ ఏకంగా 11 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ తన జోరును కొనసాగిస్తూ, నందికొండలో ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా క్లీన్ స్వీప్ దిశగా దూసుకెళ్లింది. 

జిల్లాలో ఈ స్థాయి మెజారిటీతో కాంగ్రెస్ మున్సిపాలిటీని దక్కించుకోవడంతో పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. గెలిచిన అభ్యర్థులు, కార్యకర్తలు బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచుకుంటూ నందికొండ పురవీధుల్లో భారీ విజయోత్సవ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. నందికొండ మున్సిపాలిటీ  నాగార్జున సాగర్ నియోజకవర్గం కిందికి వస్తుంది. ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరుపున జానారెడ్డి జయవీర్ రెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.  మెజారిటీ మున్సిపాలిటీల పూర్తి స్థాయి ఫలితాలు మధ్యాహ్నం 1-2 గంటల లోపు వెలువడే అవకాశం ఉంది.

యాదగిరిగుట్ట మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటుతోంది. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని 2, 3, 4వ వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఒక్కసారిగా మూడు వార్డులను తన ఖాతాలో వేసుకోవడంతో మున్సిపాలిటీపై పట్టు సాధించే దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. అయితే, మున్సిపాలిటీలో వెలువడిన అత్యంత తొలి ఫలితం మాత్రం బీజేపీకి దక్కింది. 1వ వార్డులో బీజేపీ అభ్యర్థి బోడ రాధ గెలుపొందారు. 

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టిస్తోంది. నేడు వెలువడుతున్న మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో హస్తం పార్టీ అభ్యర్థులు వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. 11,12వ వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు తమ ప్రత్యర్థులపై స్పష్టమైన మెజారిటీతో గెలుపొందారు. అలాగే 3వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ధారావత్ వీరన్న విజయం సాధించి పార్టీ బలాన్ని నిరూపించారు. 7వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి తేజ వద్దు నవీన్ గెలుపొందారు. 2వ వార్డులో  కాంగ్రెస్ అభ్యర్థిని ప్రమీల విజయం సాధించారు. 10వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి మల్లం ప్రమీల ఘన విజయాన్ని అందుకున్నారు.

Advertisment
తాజా కథనాలు