/rtv/media/media_files/2025/09/13/congress-2025-09-13-19-45-45.jpg)
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి.తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన ఎన్నికల పోరులో 22 వార్డులకు గానూ 17 వార్డుల్లో కాంగ్రెస్ విజయం సాధించగా, 2 బీఆర్‌ఎస్, ఒకటి బీజేపీ దక్కించుకున్నాయి. దీంతో మున్సిపాలిటీపై కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. కాగా ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు జరిగిన ఈ ఎన్నికల్లో ఫలితాలు వేగంగా వెలువడుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ మెజారిటీ మున్సిపాలిటీల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.
Follow Us