BREAKING: మాజీ ఎమ్మెల్యే కన్నుమూత!

TG: మెట్‌పల్లి మాజీ ఎమ్మెల్యే, దివంగత మాజీ ఎమ్మెల్యే కొమొరెడ్డి రాములు సతీమణి కొమొరెడ్డి జ్యోతిదేవి(70) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు.

EX MLA Jyoti Devi
New Update

Congress: కాంగ్రెస్ పార్టీలో విషాదం నెలకొంది. మెట్‌పల్లి మాజీ ఎమ్మెల్యే, దివంగత మాజీ ఎమ్మెల్యే కొమొరెడ్డి రాములు సతీమణి కొమొరెడ్డి జ్యోతిదేవి(70) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. కాగా ఆమె మరణం పట్ల కాంగ్రెస్ నాయకులతో పాటు వివిధ పార్టీల నేతలు సంతాపం తెలియజేస్తున్నారు.

భర్త ప్రోత్సహంతో....

మెట్‌పల్లి ప్రజలకు మాజీ ఎమ్మెల్యే జ్యోతిదేవి జ్యోతక్కగా సుపరిచితురాలు. ఆమె ఎల్‌ఎల్‌బీ చేసింది. తన భర్త ప్రోత్సహం వల్లే జ్యోతిదేవి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తన రాజకీయ జీవితానికి ఆమె భర్త దివంగత మాజీ ఎమ్మెల్యే కొమొరెడ్డి రాములు బాట వేశారనే చెప్పాలి. 1994లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మెట్‌పల్లి మండలం వెంకట్రావుపేట ఎంపీటీసీగా గెలిచారు. ఆ తరువాత ఎంపీపీగా పని చేశారు. ఇదిలా ఉంటే 1998లో మెట్‌పల్లి ఎమ్మెల్యేగా ఉన్న చెన్నమనేని విద్యాసాగర్‌రావు ఎంపీగా గెలుపొందారు. 

ఈ క్రమంలో మెట్‌పల్లిలో ఉపఎన్నిక జరిగింది. ఆ సమయంలో ఎంపీపీగా ఉన్న జ్యోతిదేవి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉపఎన్నికలో పోటీచేసి బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డిపై విజయం సాధించారు. సుమారు 17 నెలలపాటు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ సమాయంలో  పార్టీ తరఫున ఢిల్లీలో  ఆందోళనలు చేసి, ఏఐసీసీ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ దృష్టిలో పడ్డారు. ఆమెను గుర్తించిన సోనియా గాంధీ ఆలిండియా మహిళా ఎమ్మెల్యేల అసోసియేషన్‌ నాయకురాలిగా ఆమెకు బాధ్యతలు అప్పగించారు.

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe