హరీష్ రావు, కేటీఆర్‌.. రుణమాఫీపై చర్చకు సిద్ధమా?: జగ్గారెడ్డి

TG: రుణమాఫీపై చర్చకు సిద్ధమా? అంటూ కేటీఆర్, హరీష్ రావుకు సవాల్ చేశారు జగ్గారెడ్డి. రుణమాఫీ కోసం ఆగస్టులో రూ.18 వేల కోట్లు మంజూరు చేశామని.. ఇంకో రూ.12 వేల కోట్లు ఇవ్వాల్సి ఉందని అన్నారు. చిన్న చిన్న సమస్యలతో రుణమాఫీ ఆగిందని చెప్పారు.

Jagga Reddy: ఐదేళ్లు రేవంతే సీఎం.. జగ్గారెడ్డి కీలక ప్రకటన
New Update

Jagga Reddy: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రుణమాఫిపై బీఆర్ఎస్ మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. వారిపై నిప్పుల చెరిగారు. రుణమాఫీ జరగలేదని మాజీ మంత్రి హరీష్ రావు పదేపదే అంటున్నారని అన్నారు. రుణమాఫీ కోసం ఆగస్టులో తమ ప్రభుత్వం రూ.18 వేల కోట్లు మంజూరు చేసినట్టు చెప్పారు. రుణమాఫీ కోసం ఇంకో రూ.12 వేల కోట్లు ఇవ్వాల్సి ఉందని అన్నారు.

బీఆర్ఎస్ ఐదేళ్లయినా...

చిన్న చిన్న సమస్యలతో రుణమాఫీ ఆగిందని చెప్పారు . బీఆర్ఎస్ చేసిన రుణమాఫీకి నాలుగు వాయిదాలు.. ఐదేళ్లు పట్టిందని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసిందని అన్నారు. రుణమాఫీపై చర్చకు హరీష్ రావు, కేటీఆర్‌ వస్తే సీఎంను ఒప్పించి తీసుకువస్తా అని అన్నారు. కేటీఆర్‌.. హరీశ్‌రావును చర్చకు తీసుకురాగలరా? అని ప్రశ్నించారు. రైతు రుణమాఫీపై సిద్దిపేటలో చర్చ పెట్టినా సిద్ధమే అని అన్నారు. కేసీఆర్‌ కుటుంబానికి రాహుల్‌ గాంధీ ఇంటి ముందు ధర్నా చేసే హక్కు లేదని ఫైర్ అయ్యారు.

దొంగ మాటలు చెప్పి...

హరీష్‌ రావు రాహుల్‌గాంధీ ఇంటిముందు ధర్నా చేస్తా అంటున్నాడని అన్నారు. ఆనాడు దొంగ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది కేసీఆర్‌ కుటుంబం అని విమర్శించారు. ఒక్క హామీ కూడా అమలు చేయని నువ్వు.. రాహుల్‌గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తా అంటే ఊరుకుంటామా.? అని మండిపడ్డారు. నువ్వు.. నీ మామ మోసాల కుటుంబం.. ప్రజలను మోసం చేసినందుకు కేసీఆర్‌ ఫాం హౌస్‌ దగ్గర దీక్ష చేస్తానని అన్నారు. నువ్వు ఢిల్లీ పోయిన రోజే నేను మీ మామ ఎక్కడ  ఉంటే అక్కడ దీక్ష చేస్తా అని జగ్గారెడ్డి తేల్చి చెప్పారు.

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe