ఉద్యోగ నోటిఫికేషన్లపై సీఎం సంచలన ప్రకటన TG: ఉద్యోగ నోటిఫికేషన్లపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏకసభ్య న్యాయ కమిషన్ నివేదిక సమర్పించిన తర్వాత కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని అన్నారు. By V.J Reddy 10 Oct 2024 in తెలంగాణ మహబూబ్ నగర్ New Update షేర్ చేయండి CM Revanth Reddy: తెలంగాణలో ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు అమలు, బీసీ కులగణన పూర్తి చేయడానికి స్పష్టమైన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేయడంలో ఎలాంటి చిక్కులు తలెత్తకుండా ఏక సభ్య న్యాయ కమిషన్ ద్వారా వచ్చే 60 రోజుల్లోగా సమగ్ర అధ్యయనం పూర్తి చేయించాలని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎస్సీ వ ర్గీ క ర ణ అమలు, బీసీ కులగణన అంశాలపై మంత్రివర్గ ఉప సంఘం సభ్యులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి దామోదర్, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు గారు, వేంనరేంధేర్ రెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, సీఎస్ శాంతి కుమారి, ఇతర ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. ఏకసభ్య న్యాయ కమిషన్... మంత్రివర్గ ఉపసంఘం సూచనల మేరకు తక్షణం హైకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో ఏకసభ్య న్యాయ కమిషన్‌ను నియమించాలని, అంతేకాకుండా 24 గంటల్లోగా కమిషన్‌కు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. నిర్దేశించిన రెండు నెలల గడువులోగా కమిషన్ తన రిపోర్టు సమర్పించాలంటూ పలు సూచనలు చేశారు. అప్పుడే ఉద్యోగ నోటిఫికేషన్లు... 2011 తర్వాత జన గణన జరగని కారణం గా 2011 జనాభా లెక్కల ప్రాతిపదికగా అధ్యయనం జరగాలని అన్నారు. క్షేత్రస్థాయి విజ్ఞాపనలు, ఫిర్యాదుల కోసం కమిషన్ జిల్లాల్లో పర్యటించాలని చెప్పారు. ఏకసభ్య న్యాయ కమిషన్ నివేదిక సమర్పించిన తర్వాత కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని అన్నారు. తెలంగాణలో బీసీ సామాజిక, ఆర్థిక, కుల సర్వే ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని అన్నారు. బీసీ కమిషన్‌కు తక్షణం అవసరమైన యంత్రాంగం సమకూర్చాలని అన్నారు. 60 రోజుల్లోగా సామాజిక, ఆర్థిక సర్వే పూర్తి చేసి డిసెంబరు 9 లోపు నివేదిక సమర్పించాలని చెప్పారు. ఈ సర్వే పూర్తయితే వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని అన్నారు. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి