పీఏసీ ప్రతిపక్షానికే ఇచ్చాం.. ఢిల్లీలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

పార్టీ ఫిరాయింపులపై చట్టం కఠినంగా ఉంటే తమకే మంచిదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పీఏసీ చైర్మన్ పదవి ప్రతిపక్షాలకే ఇచ్చామన్నారు. 2019లో పీఏసీ చైర్మన్ పదవి ఎంఐఎంకు ఎలా ఇచ్చారన్నారు. ముగ్గురు ఎమ్మెల్యేల వ్యవహారం కోర్టు, స్పీకర్ పరిధిలో ఉందన్నారు.

New Update

ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్‌చాట్‌ చేశారు. పీఏసీ ప్రతిపక్షానికే ఇచ్చామన్నారు. అసెంబ్లీ చివరి రోజు బీఆర్ఎస్ సభ్యుల సంఖ్యను ప్రకటించారన్నారు. అప్పుడు బీఆర్ఎస్ ఎందుకు అభ్యంతరం చెప్పలేదని ప్రశక్నించారు. 2019 నుంచి అక్బరుద్దీన్‌ ఓవైసీకి పీఏసీ ఛైర్మన్‌గా ఎలా ఉంటారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రతిపక్షంగా ఉంటే MIMకు పీఏసీ చైర్మన్ పదవి ఎలా ఇచ్చారు? అని ప్రశ్నించారు. బతకడానికి వచ్చినోళ్ల ఓట్లు కావాలి కానీ వాళ్లకు సీట్లు ఇవ్వొద్దా? అని అన్నారు.

కౌశిక్ రెడ్డి కామెంట్స్‌పై కేసీఆర్ కుటుంబం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వాళ్లకు తెలియకుంటే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్నారు. పార్టీ ఫిరాయింపులపై చట్టం కఠినంగా ఉంటే మాకు మంచిదేనన్నారు. కోర్టు నిర్ణయాలు మాకే మేలు చేస్తాయన్నారు. తమ ఎమ్మెల్యేలు చేజారకపోతే ప్రభుత్వం బలంగానే ఉంటుందన్నారు.

ప్రభుత్వాన్ని పడగొడతామన్నది బీఆర్ఎస్ వాళ్లేనన్నారు. ముగ్గురు ఎమ్మెల్యేల వ్యవహారం కోర్టు, స్పీకర్ పరిధిలో ఉందన్నారు. ఆ అంశంపై కామెంట్ చేయనన్నారు. స్పీకర్ తన నిర్ణయం తీసుకుంటారన్నారు.

#cm-revanth-reddy
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe