మూసీ నిర్వాసితులకు మెరుగైన పరిహారం.. సీఎం రేవంత్ ప్రెస్-LIVE

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చాలా రోజుల తర్వాత ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు. గ్రూప్-1, హైడ్రా, కొండా సురేఖ తదితర వివాదాలపై ఆయన క్లారిటీ ఇస్తున్నారు. ఇందుకు సంబంధించిన లైవ్ ను ఈ వీడియోలో చూడండి.

New Update

గత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే మూసీ మురికి కూపంగా మారిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మూసీ బాధితులను ఆదుకోవడానికి మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ తీసుకువచ్చామన్నారు. పదేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్న బంధిపోటు దొంగలు మూసీ ప్రాజెక్ట్ ను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ నేతలపై ఫైర్ అయ్యారు. గతంలో కంప్యూటర్లను తీసుకువచ్చినప్పుడు కూడా ఉద్యోగాలు పోతాయని విమర్శించిన వాళ్లు కూడా ఉన్నారన్నారు. మూసీలో ఉన్న మురికి కంటే వాళ్ల మెదడులో ఉన్న మురికే ఎక్కువన్నారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుల వద్దకు తాను సెక్యూరిటీ లేకుండా వస్తానని.. రచ్చబండకు కేసీఆర్ సిద్ధమా? అని సవాల్ విసిరారు. తాము అద్దాల మేడల కోసం, అందాల భామల కోసం కలిసి పని చేయడం లేదన్నారు. తాము చేసేది మూసీ సుందరీకరణ కాదని.. మూసీ ప్రక్షాళన అని స్పష్టం చేశారు. బఫర్ జోన్లో పది వేల ఇళ్లు ఉన్నాయన్నారు. ఈటల రాజేందర్, హరీశ్ రావు, కేటీఆర్ కు మూసీ రివర్ బెడ్ లో నిర్వాసితులు ఖాళీ చేసిన ఇళ్లను కేటాయిస్తామన్నారు. అక్కడ ఓ మూడు నెలలు ఉండి పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్పాలన్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో ఇప్పటివరకు తాము ఒక్క ఇళ్లు కూడా కూల్చలేదన్నారు. మూసీ పరివాహక ప్రాంతంలోని వారికి మెరుగైన పరిహారం ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ఇందుకు ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని ప్రతిపక్షాలను కోరారు. 

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe