Sarpanch Elections: తెలంగాణలో స్థానిక సంస్థల ఎప్పుడు జరుగుతాయనే చర్చకు తెర దింపారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల్లో చెప్పినట్టుగా కులగణన, ఎస్సీ వర్గీకరణ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ ఇస్తామని సీఎం రేవంత్ ఇటీవల ప్రకటన చేశారు. ఇందుకోసం ఏకసభ్య న్యాయ కమిషన్ పేరుతో ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీ 60 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని అధికారులకు సీఎం ఆదేశాలు ఇచ్చారు. కాగా మరో రెండు నెలల్లో తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.
ఉద్యోగ నోటిఫిషన్లకు బ్రేక్...
ఇటీవల బీసీ కులగణన అంశాలపై మంత్రివర్గ ఉప సంఘం సభ్యులతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 2011 తర్వాత జన గణన జరగని కారణం గా 2011 జనాభా లెక్కల ప్రాతిపదికగా అధ్యయనం జరగాలని అన్నారు. క్షేత్రస్థాయి విజ్ఞాపనలు, ఫిర్యాదుల కోసం కమిషన్ జిల్లాల్లో పర్యటించాలని చెప్పారు. ఏకసభ్య న్యాయ కమిషన్ నివేదిక సమర్పించిన తర్వాత కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని అన్నారు.
తెలంగాణలో బీసీ సామాజిక, ఆర్థిక, కుల సర్వే ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని అన్నారు. బీసీ కమిషన్‌కు తక్షణం అవసరమైన యంత్రాంగం సమకూర్చాలని అన్నారు. 60 రోజుల్లోగా సామాజిక, ఆర్థిక సర్వే పూర్తి చేసి డిసెంబరు 9 లోపు నివేదిక సమర్పించాలని చెప్పారు. ఈ సర్వే పూర్తయితే వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని అన్నారు.