Tirumala: తిరుమల లడ్డూ వివాదం..చిలుకూరు ప్రధానార్చకులు ఏమన్నారంటే!

తిరుమల లడ్డూ విషయంలో చెలరేగుతున్న వివాదం గురించి తాజాగా చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్‌ స్పందించారు.ఈ విషయం నమ్మలేని, భయంకరమైన నిజమని అన్నారు.జాతీయ స్థాయిలో ధార్మిక పరిషత్‌ ఏర్పాటు చేస్తే ఇలాంటి దారుణాలకు అడ్డుకట్ట వేయోచ్చన్నారు.

rangarajan
New Update

గత రెండు రోజులుగా తిరుమల లడ్డూ విషయంలో చెలరేగుతున్న వివాదం గురించి తాజాగా చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్‌ స్పందించారు. ఈ విషయం చాలా మందిని బాధపెట్టిందన్నారు.ఈ విషయం నిజంగా నమ్మలేని, భయంకరమైన నిజమని అని ఆయన అన్నారు. కలియుగ వైకుంఠ క్షేత్రంలో ఇలాంటి ఘటనలు జరగడమనేది చాలా బాధాకరమైన విషయమని తెలియజేశారు. టెండరింగ్‌ ప్రక్రియే తప్పు అంటూ ఆయన విమర్శించారు.

నిజనిజాలపై ఏపీ ప్రభుత్వం వెంటనే ఈ విషయం గురించి విచారణ చేపట్టాలని ఆయన అన్నారు. ఈ మేరకు ఓ వీడియో సందేశాన్ని రంగరాజన్‌ ఈ సందర్భంగా విడుదల చేశారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆకాంక్షిస్తున్నట్లు జాతీయ స్థాయిలో ధార్మిక పరిషత్‌ ఏర్పాటు చేస్తే ఇలాంటి దారుణాలకు అడ్డుకట్ట వేయోచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయం గురించి కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి తిరుమల పవిత్రతను కాపాడాలని ఆయన వేడుకున్నారు.

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe