Telangana Floods: ఈ నెల 11న తెలంగాణకు కేంద్ర బృందం రాక

అకాల వర్షాలతో అతలాకుతలం అయిన తెలంగాణలోని వరద ప్రాంతాల్లో నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్రం నుంచి ఒక బృందం రానుంది. కల్నల్ కీర్తి ప్రతాప్ సింగ్ నేతృత్వంలోని 6 గురు సభ్యుల కేంద్ర బృందం 11 సెప్టెంబర్ నాడు తెలంగాణలోని ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు సహా.. వరద కారణంగా ప్రభావితమైన ప్రాంతాల్లో పర్యటించనున్నాయి. 

Khammam floods: ఖమ్మంకు మరో ముప్పు.. 3 రోజులు గండమే!
New Update

Telangana Floods: తెలంగాణలో వరద ప్రాంతాలను చూసేందుకు, అక్కడ నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక బృందాన్ని ఇక్కడ పంపిస్తోంది. ఆరుగురు సభ్యులతో ఉన్న బృందం సెప్టెంబర్ 11న అంటే బుధవారం తెలంగాణలో పర్యటించనున్నారు.  తెలంగాణలోని ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలతో పాటూ మిగతా ప్రాంతాల్లో కూడా వీరు పర్యటించనున్నారు. ఈ బృందంలో కల్నల్ కేపీ సింగ్‌తో పాటుగా.. ఆర్థిక శాఖ, వ్యవసాయ శాఖ, రోడ్లు, రహదారుల శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ విభాగాలకు చెందిన అధికారులుండనున్నారు. ఈ బృందం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులు, అధికారులతో చర్చిస్తుంది.

#telangana-floods
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe