KTR సంచలన నిర్ణయం.. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు.. TG: కేటీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు సాయంత్రం 6 గంటలకు ట్విట్టర్‌లో నెటిజన్లు అడిగే ప్రశ్నలకు సమాధానం చెబుతానని అన్నారు. #ASKKTR అని ప్రశ్నలు అడగాలని సూచించారు. కాగా కేటీఆర్ ఎలాంటి కామెంట్స్ చేస్తారనే ఆసక్తి రాష్ట్ర రాజకీయాల్లో నెలకొంది. By V.J Reddy 31 Oct 2024 in తెలంగాణ కరీంనగర్ New Update షేర్ చేయండి MLA KTR: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు సాయంత్రం ట్విట్టర్‌లో నెటిజన్లు అడిగే ప్రశ్నలకు సమాధానం చెబుతానని అన్నారు. ట్విట్టర్ లో #ASKKTR అని ప్రశ్నలు అడగాలని సూచించారు. కాగా కేటీఆర్ ఎలాంటి కామెంట్స్ చేస్తారనే ఆసక్తి రాష్ట్ర రాజకీయాల్లో నెలకొంది. కాగా గత కొన్ని రోజులుగా కేటీఆర్ పై కాంగ్రెస్, బీజేపీ నేతలు అనేక విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఇటీవల మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు అటు రాజకీయాలతో పాటి సినీ ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టించిన సంగతి విదితమే. దీనిపై కేటీఆర్ కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ కేసులో కోర్టు పరిధిలో ఉంది. ఇటీవల బావమరిదితో చిక్కుల్లో... ఇటీవల జన్వాడ రిజర్వ్ కాలనీలోని ఓ ఫామ్ హౌజ్ లో డ్రగ్స్ పార్టీ నిర్వహించినట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అక్కడి చేరుకున్న పోలీసులు పార్టీకి పాల్గొన్న వాళ్లకు డ్రగ్స్ టెస్ట్ చేయగా ఒకరికి పాజిటివ్ వచ్చింది. కొకయున్ తీసుకున్నట్టు గా డ్రగ్ టెస్ట్ లో తేలడం తొ Ndps యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ ఫాం హౌస్ లో జరిగిన పార్టీ పై డ్రగ్స్ Ndps యాక్ట్ కేసు నమోదు చేశారు. మొత్తం ఈ పార్టీలో 21 మంది మహిళలు, 14 మంది పురుషులు ఉన్నట్లు అధికారులు చెప్పారు. భారీ శబ్దాలతో పార్టీ నడుస్తున్న సమాచారం రావడంతొ పోలీసుల తనఖీలు చేపట్టగా ఈ విషయం బయటకు వచ్చింది. మరో వైపు భారీగా ఫారిన్ లిక్కర్ స్వాధీనం చేసుకొని.. వాటిని ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు పోలీసులు. Section 34, Excise Act కింద మరో కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే.. కేటీఆర్ బావమరిదికి చెందిన ఫామ్ హౌస్ గా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ను పోలీసులు విచారించారు. కాగా ఈ అంశంపై ఇప్పటికే కేటీఆర్ క్లారిటీ ఇవ్వగా.. ఈరోజున జరిగే చిట్ చాట్ లో ఈ అంశంతో పాటు మిగతా అంశంపై కేటీఆర్ వివరణ ఇవ్వనున్నట్లు సమాచారం. Been a while since the last #AskKTR sessionLet’s have a chat today evening around 6PM IST Please use the #AskKTR — KTR (@KTRBRS) October 31, 2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి