తెలంగాణ ద్రోహి సీఎం అయ్యాడు.. కవిత ఫైర్! TG: ఎన్నడూ జై తెలంగాణ అని అనని వ్యక్తి తెలంగాణకు ముఖ్యమంత్రి కావడం మన దురదృష్టమని కవిత అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఆత్మ లేదని, ఆయన ఉద్యమంలో లేరు కాబట్టి తెలంగాణ హృదయం అర్థమవ్వడం లేదని సెటైర్లు వేశారు. By V.J Reddy 14 Dec 2024 in తెలంగాణ నిజామాబాద్ New Update షేర్ చేయండి MLC Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శల దాడికి దిగారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. మహిళలు జరుపుకునే బతుకమ్మను ముఖ్యమంత్రి అవమానించిన విషయం తెలిసిందా లేదా ? లేదంటే మీ సమ్మితితోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ సమాజాన్ని అవమానిస్తున్నారా అన్నది తెలంగాణ సమాజానికి చెప్పాలని సోనియా గాంధీని డిమాండ్ చేశారు. ప్రియాంకా గాంధీ కేరళ నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు కాబట్టి అక్కడి చీర కట్టుకొని పార్లమెంటులో మాట్లాడారని, మరి తెలంగాణ సీఎం బతుకమ్మను అవమానం చేస్తూ తెలంగాణ తల్లి చేతుల్లోని బతుకమ్మను మాయం చేశారని, దీనికి మద్ధతిస్తున్నారా? అని ప్రియాంకా గాంధీని ప్రశ్నించారు ఆయన సీఎం అవ్వడం దురదృష్టకరం... సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వచ్చి గ్యారెంటీ కార్డులపై సంతకాలు చేసి తెలంగాణ ప్రజలను గౌరవిస్తామని చెబితే ప్రజలు నమ్మి కాంగ్రెస్ కు ఓట్లు చేశారని అన్నారు. బీసీ వర్గాలకు చెందిన మహేశ్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నా కూడా బహుజనులను కించపరిచే విధంగా మాట్లాడిన ఎమ్మెల్యేపై కాంగ్రెస్ పార్టీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నడూ జై తెలంగాణ అని అనని వ్యక్తి తెలంగాణకు ముఖ్యమంత్రి కావడం మన దురదృష్టమని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఆత్మ లేదని, ఆయన ఉద్యమంలో లేరు కాబట్టి తెలంగాణ హృదయం అర్థమవ్వడం లేదని చెప్పారు. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి