MLA KTR: కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ మరోసారి విమర్శల దాడికి దిగారు బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్. గాంధీని గాలికి వదిలి- గాల్లో చక్కర్లు కొడుతున్న కాంగ్రెస్ అంటూ మండిపడ్డారు. మధ్యం ధరల పెంపు పై ఉన్న మక్కువ మందు బిళ్లల పై లేకపాయే అని ఫైర్ అయ్యారు. విద్యుత్ చార్జీల పెంపు పై ఉన్న మక్కువ గాంధీలో మంచి నీళ్లపై లేదని అన్నారు. మూసీపై ఉన్న మక్కువ గాంధీలో విల్ చైర్లపై లేకపాయే అని చురకలు అంటించారు.
దీపావళికి బాంబులు...
ఫోర్ బ్రదర్స్ సిటీపై ఉన్న మక్కువ గాంధీలో విరేచనాల మందులపై లేకపాయే అని నిప్పులు చెరిగారు. దీపావళికి బాంబులు వేయడంపై ఉన్న మక్కువ గాంధీలో రోగుల పై రాష్ట్ర ప్రభుత్వానికి లేదని అన్నారు. అదానీ అంబుజా సిమెంట్ పై ఉన్న మక్కువ గాంధీలో బెటాడిన్ బిళ్లలపై లేకపాయే.. నాడు, నేడు, ఎల్లపుడు కాంగ్రెస్ ఉందంటే నేను పోను బిడ్డో సర్కారు దవాఖానాకు అనే మాటలే వినిపిస్తాయని సెటైర్లు వేశారు. ఈ మేరకు గాంధీ ఆసుపత్రిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఓ వార్త పత్రిక ప్రచురించిన కథనాన్ని ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు.