రాజకీయ సన్యాసం తీసుకుంటా.. పొంగులేటి కేటీఆర్ సంచలన సవాల్! TG: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కేటీఆర్ సవాల్ చేశారు. టెండర్ల వ్యవహారంలో రూ.1137కోట్ల అవినీతి జరగలేదని పొంగులేటి నిరూపిస్తే రాజీనామా చేయడమే కాదు రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నారు. సీఎం రేవంత్‌ను ముంచేది పొంగులేటే అని విమర్శించారు. By V.J Reddy 22 Sep 2024 in తెలంగాణ ఖమ్మం New Update షేర్ చేయండి MLA KTR: సీఎం రేవంత్ రెడ్డి పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్. మంత్రి పొంగులేటి వ్యాఖ్యలపైన ఘాటైనా కౌంటర్ ఇచ్చారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోందని అన్నారు. పొంగులేటి రాజీనామా చేయాల్సిన అవసరం లేదు.. ముఖ్యమంత్రి రేవంత్ నే రాజీనామా చేయాల్సి వస్తుందని జోస్యం చెప్పారు. దగుల్బాజీలు... రాజీనామా చేయాల్సిన దగుల్బాజీలు ఈ ముఖ్యమంత్రి ఆయన మంత్రులే అని మండిపడ్డారు. ఈ ప్రభుత్వంలోని మంత్రులకు చట్టాలు మాత్రమే కాదు చుట్టరీకాలు కూడా తెలిసినట్టు లేదనిబ్బి విమర్శించారు. భార్య తమ్ముడు బావమరిది కాకుండా ఇంకేమి అవుతాడో పొంగులేటి చెప్పాలని ప్రశ్నించారు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ తో పాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లను కూడా నేను ప్రస్తావించిన నేపథ్యంలో పొంగులేటి ఆగమేఘాలమీద ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారని అన్నారు. రాజకీయ సన్యాసం చేస్తా... 1137 కోట్ల రూపాయల అవినీతి జరిగిన, ఒక్క రూపాయి అవినీతి జరిగిన ఈ చట్టం వర్తిస్తుందనే విషయం ఆయన తెలుసుకోవాలని అన్నారు. పొంగులేటికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ దగ్గరికి వెళ్దాం అని చెప్పారు. గతంలో ఉన్న ఫైల్స్ తో పాటు ఇప్పుడు జరిగిన టెండర్ల వ్యవహారం పైన వివరాలు ఉంచుదాం అని అన్నారు. ఆయన న్యాయంగా తీర్పు చెప్పిన తర్వాత నేను చెప్పింది అబద్ధమంటే రాజీనామా కాదు రాజకీయ సన్యాసం చేస్తా అని సవాల్ చేశారు. లేదంటే కేంద్రంలోని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ లేదా మరి ఏదైనా ఏజెన్సీ దగ్గరకైనా వెళ్దాం అని అన్నారు. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగిన ఈ టెండర్ల వ్యవహారంలో అవినీతి జరిగిందని ముఖ్యమంత్రికి, మంత్రి పొంగులేటికి తెలుసు అని అన్నారు. ముఖ్యమంత్రి ఆశ్రిత పక్షపాతం లేకుండా బంధువులకు అక్రమంగా లాభం చేయను అని ప్రమాణ స్వీకారం చేసిన సీఎం రేవంత్ అవినీతికి పాల్పడ్డాడని విమర్శించారు. కేవలం రెండు కోట్ల లాభం ఉన్న బావమరిది కంపెనీకి 1000 కోట్ల కాంట్రాక్టు ఇచ్చి అవినీతి జరగడం లేదు అంటే ఎవరైనా నమ్ముతారా? అని నిలదీశారు. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి