మేఘా సంస్థని దేశమంతా బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలి: KTR TG: సుంకిశాల ఘటనకు కారణమైన మేఘా సంస్థని దేశమంతట బ్లాక్ లిస్టులో పెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మేఘా కృష్ణారెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు. మూసీ పేరుతో రూ. 5500 కోట్ల భారీ స్కాం చేయబోతున్నారని ఆరోపించారు. By V.J Reddy 06 Nov 2024 in తెలంగాణ Latest News In Telugu New Update షేర్ చేయండి MLA KTR: దొంగలు.. దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు ఉన్నది రేవంత్ యవ్వారం అని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. సుంకిశాల ఘటనకు కారణమైన కాంట్రాక్ట్ సంస్థ మేఘా సంస్థను వెంటనే బ్లాక్ లిస్టులో పెట్టాలని అప్పుడే డిమాండ్ చేశామని అన్నారు. ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవడం లేదని ఫైర్ అయ్యారు. మేఘా సంస్థ చేసిన పనికి దేశమంతా బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని డిమాండ్ చేశారు. దొంగలు.. దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు ఉన్నది రేవంత్ యవ్వారం.సుంకిశాల ఘటనకు కారణమైన కాంట్రాక్ట్ సంస్థను వెంటనే బ్లాక్ లిస్టులో పెట్టాలని అప్పుడే డిమాండ్ చేసాం.. ఇప్పటికీ చర్యలు తీసుకోని కాంగ్రెస్ ప్రభుత్వం.- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS pic.twitter.com/Ug3nrfV1gR — BRS Party (@BRSparty) November 6, 2024 మంత్రి పొంగులేటి అరెస్ట్..! మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి త్వరలో ముఖ్య నేతలు అరెస్ట్ అవుతారంటూ.. అందరి జాతకాలు చెబుతున్నాడు. నువ్వు ఎప్పుడు జైలుకు వెళ్తావో చూసుకో అని హెచ్చరించారు. నీ కంపెనీకి కనీసం ఆఫీస్ ఆఫ్ బెన్ ఫిట్ అని కూడా పట్టించుకోకుండా ఏ విధంగా పనులు కట్టబెడతారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి, మేఘా కృష్ణారెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు. అమృత్ టెండర్లను కూడా పొంగులేటి కంపెనీకి ఇచ్చారని... రాఘవ కంపెనీని కూడా గతంలో రేవంత్ రెడ్డి తిట్టాడని... ఇప్పుడు మాత్రం ఆ కంపెనీకి పనులు ఇస్తున్నాడని మండిపడ్డారు. రూ. 5500 కోట్ల భారీ స్కాం... మూసీ ని కూడా టెండర్లు కాకముందే మేఘాకు ఇవ్వాలని అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం చేశారని ఆరోపించారు కేటీఆర్. గోదావరి నీళ్లను హైదరాబాద్ కు తెచ్చేందుకు రూ. 11 వందల కోట్లతో అయిపోయే దానికి రూ. 5500 కోట్ల భారీ స్కాం చేయబోతున్నారని జోస్యం చెప్పారు. ప్రధాని మోదీ ఎన్నికలప్పుడు మాట్లాడటం కాదు... ఆర్ ఆర్ ట్యాక్స్ అంటివి కాదా? ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు అని నిలదీశారు. ఇక్కడ నిరాటకంగా RR ట్యాక్స్ తో పాటు.. బిల్డర్ల నుంచి గజానికి వంద వసూలు చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రం ఎందుకు పట్టించుకోవటం లేదు.. ఇంత అరాచకంగా కుంభకోణాలకు పాల్పడుతుంటే ఏం చేస్తున్నారు అని నిలదీశారు. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి