గప్పాలు కొట్టే రేవంతు.. ఇకనైనా.. హారిష్ రావు ఫైర్!

TG: హామీలు నెరవేర్చకుండా సీఎం రేవంత్ గప్పాలు కొడుతున్నారని అన్నారు హరీష్ రావు. కాంగ్రెస్ పాలనలో 10 నెలలుగా అంగన్వాడి కేంద్రాలకు అద్దెలు కూడా చెల్లించని దుస్థితి నెలకొందన్నారు. ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తున్నట్లు చేస్తున్న డబ్బా ప్రచారాన్ని ఆపాలన్నారు.

New Update
HARISH RAOO

MLA Harish Rao: తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు. ఒకటో తేదీనే జీతాలు అంటూ సీఎం చెప్తున్నారని చెప్పారు. 14వ తేదీ వచ్చినా 39,568 మంది అంగన్వాడీలకు జీతాలు రాలేదని గుర్తు చేశారు. 10 నెలలుగా అంగన్వాడీ కేంద్రాలకు అద్దెలు కూడా చెల్లించలేదని చెప్పారు. విశ్రాంత ఉద్యోగులను సైతం ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఉత్తర్వులు ఉంటే తప్ప రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఇవ్వడం లేదని ఆరోపించారు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించి మాట నిలబెట్టుకోండి అని సీఎం రేవంత్ కు సూచనలు చేశారు.

గప్పాలు కొట్టిన రేవంత్...

హరీష్ రావు తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో.. "ఒకటో తేదీ నాడే ఉద్యోగులకు జీతాలు అంటూ గప్పాలు కొట్టిన సీఎం రేవంత్.. ఈనెల 14వ తేదీ వచ్చినా 39,568  మంది అంగన్వాడీ టీచర్లలు, ఆయాలు జీతాలు రాక ఆవేదన చెందుతున్న పరిస్థితి. 10 నెలలుగా అంగన్వాడి కేంద్రాలకు అద్దెలు కూడా చెల్లించని దుస్థితి. ఏడాది కాంగ్రెస్ పాలనలో మీరు సాధించిన ఘనత ఇది. విశ్రాంత ఉపాధ్యాయులను, ఉద్యోగులను సైతం ఇబ్బందులకు గురి చేస్తున్నావు. 

హైకోర్టు ఉత్తర్వులు ఉంటే తప్ప హక్కుగా రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా వారిని, వారి కుటుంబాలను క్షోభకు గురి చేస్తున్నావు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, విశ్రాంత ఉపాధ్యాయ, ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఇలా లక్షల మంది సకాలంలో జీతాలు రాక అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తున్నట్లు చేస్తున్న డబ్బా ప్రచారాన్ని ఇకనైనా ఆపండి. ఉద్యోగులందరికీ సకాలంలో జీతాలు చెల్లించి మాట నిలుపుకోండి." అని పోస్ట్ చేశారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు