టీడీపీలో చేరబోతున్నాం.. చంద్రబాబును కలిసిన తర్వాత BRS నేతల సంచలన ప్రకటన!

మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సంచలన ప్రకటన చేశారు. తాను త్వరలోనే టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటన చేశారు. ఈ రోజు అమరావతిలో సీఎం చంద్రబాబుతో మాజీ మంత్రి మల్లారెడ్డి, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి తదితరులు భేటీ అయ్యారు.

New Update

మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సంచలన ప్రకటన చేశారు. తాను త్వరలోనే టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటన చేశారు. ఈ రోజు అమరావతిలో సీఎం చంద్రబాబుతో మాజీ మంత్రి మల్లారెడ్డి, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి తదితరులు భేటీ అయ్యారు. మల్లారెడ్డి తన మనవరాలి వివాహానికి హాజరుకవాలని చంద్రబాబును ఆహ్వానించారు. అనంతరం బయటకు వచ్చిన తర్వాత తీగల కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో టీడపీకి పునర్ వైభవం తెస్తామని ఆయన ప్రకటించారు. తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చేది టీడీపీనేనన్నారు. త్వరలోనే పెద్ద ఎత్తున టీడీపీలో చేరికలు ఉంటాయన్నారు. పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రులు ఆ పార్టీలో చేరనున్నట్లు చెప్పారు. మల్లారెడ్డి మాత్రం మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. దీంతో తీగల కృష్ణారెడ్డితో పాటు మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి కూడా టీడీపీలో చేరుతారా? అన్న అంశంపై చర్చ సాగుతోంది. 

ఇద్దరూ టీడీపీ నుంచే రాజకీయాల్లోకి..

2014లో మల్లారెడ్డి టీడీపీ తరఫున మల్కాజ్ గిరి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. అదే ఎన్నికల్లో తీగల కృష్ణారెడ్డి సైతం టీడీపీ నుంచి మహేశ్వరం ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం ఈ ఇద్దరు టీఆర్ఎస్ లో చేరిపోయారు. మల్లారెడ్డి 2018లో టీఆర్ఎస్ నుంచి మేడ్చల్ ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించగా.. మహేశ్వరం నుంచి పోటీ చేసిన తీగల ఓటమి పాలయ్యారు. అనంతరం అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించిన సబితారెడ్డి టీఆర్ఎస్ లో చేరి మంత్రి అయ్యారు. అప్పటి నుంచి తీగల కృష్ణారెడ్డి గులాబీ పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయన కోడలికి జెడ్పీ చైర్మన్ పదవి ఇచ్చానా కూడా సంతృప్తి చెందలేదు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కోడలితో కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీలోనూ ఆయన కంఫర్ట్ గా లేనట్లు తెలుస్తోంది. ఈ కమ్రంలో సొంతగూటికి చేరాలని డిసైడ్ అయినట్లు సమాచారం.

మల్లారెడ్డి కొత్త స్కెచ్?

మల్లారెడ్డి కూడా బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన నాటి నుంచి పార్టీ మారుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయన ఆస్తులు, కాలేజీలకు సంబంధించి వరుస నోటీసులు రావడం.. కూల్చివేతలు జరగడంతో రక్షించుకోవడానికి అధికార కాంగ్రెస్ లో చేరుతారన్న ప్రచారం సాగింది. అయితే.. రేవంత్ రెడ్డి అందుకు సుముఖంగా లేరన్న చర్చ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు చంద్రబాబును కలవడం, ఆయనతో పాటు చంద్రబాబుతో భేటీ అయిన తీగల కృష్ణారెడ్డి తాను టీడీపీలో చేరుతానని ప్రకటించడంతో కొత్త చర్చ మొదలైంది. మల్లారెడ్డి కూడా టీడీపీలోకి చేరే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. 

ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీలో చేరితే తనకు ఇబ్బందులు ఉండవని మల్లారెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. ఇంకా.. చంద్రబాబుతో రేవంత్ రెడ్డికి చెప్పించి తన కాలేజీలు, ఆస్తుల వ్యవహారంలో దూకుడుగా వెళ్లకుండా కట్టడి చేయొచ్చని మల్లారెడ్డి స్కెచ్ వేస్తున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా చర్చ సాగుతోంది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు