BRS Party: ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ సంబరాలు చేయనుంది. విద్యుత్ ఛార్జీల పెంపును ఈఆర్సీ తిరస్కరించడంతో జిల్లా కేంద్రాల్లో, నియోజకవర్గాల్లో సంబరాలకు పిలుపునిచ్చింది. రూ.18,500 కోట్ల విద్యుత్ భారాన్ని ప్రజలపై పడకుండా అడ్డుకున్నామని బీఆర్ఎస్ ఈ కార్యక్రమం చేపట్టింది. కాగా గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీ... కరెంట్ ఛార్జీలను ప్రభుత్వం పెంచాలని చూస్తోందని ఆరోపించింది. ఉచిత విద్యుత్ పథకంపై వస్తున్న భారాన్ని సామాన్య ప్రజలపై మోపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని పేర్కొంది.
ఛార్జీల పెంపుపై కీలక ప్రకటన....
ఇటీవల తెలంగాణలో సామాన్యులకు షాక్ అంటూ త్వరలో కరెంట్ ఛార్జీలను రేవంత్ సర్కార్ పెంచబోతుందంటూ జరుగుతున్న ప్రచారంపై డిస్కం సీఎండీ ముషారఫ్ స్పందించారు. రాష్ట్రంలో సామాన్యులపై కరెంట్ ఛార్జీలు పెంచబోమని తేల్చి చెప్పారు. అవన్నీ తప్పుడు ప్రచారాలు అంటూ కొట్టి పారేశారు. హైటెన్షన్ ఇండస్ట్రియల్ వినియోగదారులపై కూడా ఛార్జీల భారం పడదని అన్నారు. నెలకు 300 యూనిట్లకు పైగా వినియోగదారులకు ఫిక్స్డ్ ఛార్జీల రూపంలో రూ.50 పెంపు కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించామని చెప్పారు.
ఆ ఛార్జీలు యథాతథం..
ఎనర్జీ ఛార్జీలు ఏ కేటగిరిగిలో కూడా పెంచడం లేదని ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగరావు అన్నారు. స్థిర ఛార్జీలు రూ.10 యథాతథంగా ఉంటాయని క్లారిటీ ఇచ్చారు.గృహ వినియోగదారులకు మినిమం ఛార్జీలు తొలగించామని చెప్పారు. పౌల్ట్రీ ఫామ్, గోట్ ఫామ్‌లను కమిషన్ ఆమోదించలేదని.. హెచ్‌టీ కేటగిరిలో ప్రతిపాదనలు రిజక్ట్ చేశామని తెలిపారు.132kva, 133kva, 11kv లలో గతంలో మాదిరిగానే ఛార్జీలు ఉండనున్నట్లు చెప్పారు. లిఫ్ట్ ఇరిగేషన్‌కు కమిషన్ ఆమోదించిందని.. అయితే, టైమ్ ఆఫ్ డేలో పీక్ అవర్‌లో ఎలాంటి మార్పు లేదని చెప్పింది.
రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటలకు నాన్ పీక్ ఆవర్‌లో రూపాయి నుంచి 1:50 రాయితీ పెంచామన్నారు. చేనేత కార్మికులకు హర్స్ పవర్‌ను పెంచామని.. హార్స్ పవర్ 10 నుంచి హెచ్‌పీ 25కి పెంచామని వెల్లడించారు. గ్రిడ్ సపోర్ట్ ఛార్జీలు కమిషన్ ఆమోదించిందని తెలిపారు. రూ.11,499.52 కోట్లు ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చిందని వెల్లడించారు. డిస్కంలు రూ.57,728.90 పిటిషన్ వేస్తే.. ఈఆర్సీ రూ. 54,183.28 కోట్లు ఆమోదించిందని తెలిపారు.