ఆ పదవి నాకొద్దు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు!

తెలంగాణ BJP చీఫ్ పదవి పోటీలో తాను లేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. కొన్ని శక్తులు ఇలాంటి ప్రచారం చేసి తనకు, పార్టీకి నష్టం కలిగించేలా కుట్రలు చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. పార్టీ అధ్యక్ష పదవి నియామకంపై హైకమాండ్ ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు.

New Update
Bandi Sanjay: కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ విలీనం.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో లేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. తనకు పార్టీ నాయకత్వం పెద్ద బాధ్యతలు అప్పగించిందన్నారు. ఆ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించేందుకు ప్రయత్నిస్తున్నానన్నారు. తనకు పార్టీ పగ్గాలు అప్పగిస్తారనేది ఊహాగానాలేనన్నారు. కొన్ని శక్తులు ఇలాంటి ప్రచారం చేసి తనకు, పార్టీకి నష్టం కలిగించేలా కుట్రలు చేస్తున్నాయన్నారు. పార్టీ అధ్యక్ష పదవి నియామకంపై హైకమాండ్ ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. బీజేపీలో సమిష్టి నిర్ణయం తీసుకున్నాకే అధ్యక్ష పదవిపై ప్రకటన చేస్తారన్నారు.

హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే..

హైకమాండ్ తీసుకునే నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు. ఈ విషయంలో మీడియా సహకరించాలని చేతులెత్తి జోడిస్తున్నానన్నారు. ఈ రోజు కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని రోజులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మళ్లీ బండి సంజయ్ ను నియమిస్తారంటూ ప్రచారం సాగుతోంది. 

ఆయనను కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించి రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగిస్తారని జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సంజయ్ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. సంజయ్ కు ప్రస్తుతం రాష్ట్ర పార్టీకి సారథ్యం వహించాలన్న ఆసక్తి లేదని స్పష్టం అవుతోంది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు