Balapur Laddu : లడ్డూ వారికే అంకితం.. RTVతో కొలన్ శంకర్!

బాలాపూర్ లడ్డూ రూ.30 లక్షల 1వెయ్యికి దక్కించుకున్న కొలన్ శంకర్ రెడ్డి RTVతో మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశారు. 'ఇది నా అదృష్టంగా భావిస్తున్నా. నాలుగుసార్లు వేలంలో పాల్గొన్నా. బంధువులు, గ్రామస్థులకు లడ్డూ పంచుతా' అన్నారు.

New Update

Balapur Laddu : ఈ యేడాది బాలాపూర్ లడ్డూ దక్కించుకున్న కొలన్ శంకర్ రెడ్డి RTVతో మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశారు. ఇది తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపాడు. ఇప్పటివరకూ తన కొలన్ ఫ్యామిలీ తొమ్మిది సార్లు లడ్డూ దక్కించుకుందని, తాను నాలుగుసార్లు వేలంలో పాల్గొంటే ఈ సారి అదృష్టం వరించిందన్నారు. బంధువులు, గ్రామస్థులకు లడ్డూ పంచుతానని చెప్పారు. 

నలుగురి మధ్య టఫ్ ఫైట్..
ఇక భారీ అంచనాలనడుమ రూ.30 లక్షల ఒక వెయ్యి రూపాయలకు కొలను శంకర్ రెడ్డి దక్కించుకున్నారు. స్థానికులు, ధనవంతులు, రాజకీయ నాయకులు ఈ లడ్డూ కోసం పోటీపడ్డారు. చివరికి మిగిలిన నలుగురు కొలను శంకర్ రెడ్డి, దశరథ్ గౌడ్, ప్రణీత్ రెడ్డి, లక్ష్మీ నారాయణ మధ్య టఫ్ ఫైట్ నడిచింది  గతేడాదికంటే మూడు లక్షలుపెరిగింది. 1994నుంచి హైదరాబాద్ బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం ప్రసిద్ధిగాంచింది. ఎప్పటిలాగే గతేడాది ఈ లడ్డూ వేలం ఘనంగా జరిగింది. 2023 లడ్డూ వేలంలో 36 మంది పాల్గొనగా రూ.27 లక్షలకు తుర్కయాంజల్‌కు చెందిన దాసరి దయానంద రెడ్డి లడ్డూను దక్కించుకున్నారు.

అయితే ఈసారి లడ్డూ వేలం పాటలో ఈసారి కొత్త నిబంధనలు పెట్టారు నిర్వాహకులు. ముందుగా 27లక్షలు కట్టిన వాళ్ళకే వేలంలో అవకాశం ఇస్తామని ప్రకటించారు. దీంతో ధనవంతులు, రాజకీయ నాయకులు ఈ లడ్డూ కోసం పోటీపడ్డారు. ఇదిలా ఉంటే.. ఉదయం 10 గంటలకు శోభాయాత్ర ప్రారంభమైంది. ఊరేగింపు తర్వాత బోడ్రాయి దగ్గర లడ్డూ వేలం పాట జరిగింది. అనంతరం శోభాయాత్ర కొనసాగిస్తూ గతేడాదిలాగే సాయంత్రం 4 గంటలకు నిమజ్జనం చేయనున్నట్లు నిర్వహాకులు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు