Government job: మూడేళ్లలో 15 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువకుడు! ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే గగనం. అలాంటిది ఏకంగా 15 ప్రభుత్వ ఉద్యోగకొలువులలో ఉద్యోగం సాధించాడు. అదీ మూడు సంవత్సరాల వ్యవధిలో 15 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అనిపించాడు ఈ యువకుడు. By Durga Rao 02 Apr 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలానికి చెందిన రమావత్ మధుసూదన్ తాజాగా విడుదలైన ఐబీపీఎస్ ఫలితాల్లో పీవో కేడర్‌లో కెనరాబ్యాంకులో ఉద్యోగాన్ని సాధించాడు. ఇంతకు మునుపు ఆర్‌ఆర్‌బీ, ఐబీపీఎస్, ఎస్‌బీఐలలో పీవో పోస్టులు.. ఎల్‌ఐసీ ఏఏవో, ఎన్‌ఐఏసీఎల్ ఏవో, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ మేనేజర్, ఎఫ్‌సీఐలో అసిస్టెంట్ గ్రేడ్-3, ఐడీబీఐలో అసిస్టెంట్ మేనేజర్, ఆర్‌ఆర్‌బీ, ఐబీపీఎస్, ఎస్‌బీఐ, ఐడీబీఐ విభాగాల్లో క్లరికల్ ఉద్యోగాలు, ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్‌లో ఎగ్జిక్యూటివ్ క్లరికల్, టీఎస్ క్యాబ్‌లో మేనేజర్ ఉద్యోగాలకు సెలక్ట్ అయ్యాడు. అయితే.. తనకు పోస్టు కేటాయించిన ప్రదేశం, వాతావరణం, వేర్వేరు కారణాలతో ఇప్పటివరకు ఏ ఉద్యోగంలోనూ చేరలేదంట ఈ మధుసూదన్. ప్రస్తుతం ‘స్టాఫ్ సెలక్షన్ కమిషన్ - సీజీఎల్ (SSC CGL)’లో ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా ప్రిపేరవుతున్నాడు. ఇక.. కుటుంబం విషయానికొస్తే.. మధుసూధన్ తండ్రి పాండు వ్యవసాయం చేస్తుండగా.. తల్లి నాగమణి స్కూల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు లేకపోవడం, తల్లి ప్రోత్సాహంతో విజయాలు సాధిస్తున్నట్లు చెప్తాడు మధుసూదన్. 2020లో బీటెక్ (ఎన్‌ఐటీ కాలికట్- బ్రాంచ్ ఈఈఈ) పూర్తి చేసిన మధుసూదన్ ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా గోల్ పెట్టుకున్నాడు.బీటెక్‌లో 60శాతం మార్కులతో పాసైన మధుసూదన్.. ఒక సంవత్సరం పాటు బ్యాంకు ఉద్యోగం కోసం తీవ్రంగా శ్రమించి.. మొదటి ప్రయత్నంలో విజయం అందకపోయినా కుంగిపోలేదు. కచ్చితంగా విజయం సాధిస్తాననే నమ్మకంతో తన ప్రయత్నాన్ని కొనసాగించాడు. ఆ తర్వాత వరసగా ఐబీపీఎస్, ఎస్‌బీఐతో పాటు పలు బ్యాంకుల నుంచి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. అప్పటికే కోర్సు పూర్తిచేసి సన్నద్ధమై పరీక్షలు రాయగా తొలుత క్లర్క్, ఆ వెంటనే ఆఫీసర్ కేడర్ ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. ఆ తర్వాత ఎస్‌బీఐ పీవో (SBI PO)గా కర్ణాటకలో ఎంపికవడంతో ఉద్యోగంలో చేరాడు. అనంతరం కొన్ని రోజులకు తెలంగాణలో గ్రూప్ నోటిఫికేషన్లు విడుదల కావడంతో.. ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి మళ్లీ ప్రిపేర్ కావడం మొదలుపెట్టాడు. దిల్‌సుఖ్‌నగర్‌లోని కోచింగ్ సెంటర్లో చేరి.. నిరంతరం పరీక్షలు రాస్తూ.. ఎప్పటికప్పుడు సందేహాలను నివృత్తి చేసుకోవడంతో ఈ విజయాలు సాధ్యమయ్యాయంటాడు మధుసూదన్. ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ (SSC CG) ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేరవుతున్న మధుసూదన్ ఆ ఉద్యోగం కూడా సాధిస్తానని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నాడు. #telangana #15government-jobs #ramawat-madhusudan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి