పెంపుడు శునకానికి సమాధి, ఆపై అంతిమ సంస్కారం..!

సాధారణంగా మనం ఇంట్లో పెంచుకునే పెంపుడు కుక్క చనిపోతే ఏం చేస్తాం.. ఇంకేం చేస్తాం బయటకు తీసుకెళ్లి పడేస్తాం. కానీ ఇక్కడ మాత్రం అలా చేయలేదు. ఆ శునకంతో ఉన్న సాన్నిహిత్యాన్ని దాని జ్ఞాపకాన్ని మర్చిపోలేక ఏకంగా సమాధిని నిర్మించాడు ఓ యజమాని. అంతేకాకుండా డప్పు వాయిద్యాలతో శునకాకిని అంతిమ సంస్కారం నిర్వహించాడు. ఈ విచిత్ర సంఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.

పెంపుడు శునకానికి సమాధి, ఆపై అంతిమ సంస్కారం..!
New Update

telangana-viral-news-pet-dog-owner-from-mahabubabad-district-built-grave-for-pet-dog-video

గత పది సంవత్సరాలుగా అల్లారుముద్దుగా తన ఇంట్లోనే పెంచుకున్న శునకం అది. ఆ ఇంట్లో ఒకరిగా మెదిలిన పెంపుడు కుక్క ఆకస్మాత్తుగా మృతిచెందడంతో దాని జ్ఞాపకాలను మరిచిపోలేక ఇలా చేశామంటున్నాడు ఆ ఇంటి యజమాని.పెంపుడు కుక్క చనిపోతే ఆ శునకంతో ఉన్న జ్ఞాపకాన్ని మర్చిపోలేక సమాధి నిర్మించాడు. అంతేకాకుండా దానికి మనిషి చనిపోతే ఎలాగైతే సపరిచర్యలు చేస్తారో అలా.. కుక్క చనిపోయిన తరువాత డప్పు వాయిద్యాలతో శునకానికి అంతిమ సంస్కారం నిర్వహించాడు.

మహబూబాబాద్- తాళ్ళపూసపెల్లి గ్రామంలో ఘటన

ఈ విచిత్ర సంఘటన ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రస్తుతం నూతనంగా ఏర్పడిన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. గత పది సంవత్సరాలుగా తనవద్ద అల్లారుముద్దుగా పెంచుకున్న శునకం. ఆ ఇంట్లో ఒకరిగా మెదిలిన పెంపుడు కుక్క ఆకస్మాత్తుగా మృతి చెందడంతో ఆ జ్ఞాపకాలను మరిచిపోలేక దాని యాజమాని సమాధి కట్టించాడు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్ళపూసపెల్లి గ్రామంలో జరిగింది. రాచర్ల వీరన్న అనేవ్యక్తి తన ఇంట్లో పది సంవత్సరాలుగా ఓ పెంపుడు కుక్కను పెంచుకుంటున్నాడు.

శునకానికి ప్రత్యేక సమాధి, పూజలు

ఇటీవల ఆ పెంపుడు కుక్క తీవ్ర అనారోగ్యానికి గురయ్యింది. ఈ క్రమంలోనే తాజాగా.. ఆ కుక్క ఉన్నట్టుండి మరణించింది. ఎన్నో ఏళ్లుగా తన ఇంట్లోనే ఒకరిగా మెదిలిన ఆ శునకం మరణించడంతో కుటుంబసభ్యులు తల్లడిల్లిపోయారు. మృతిచెందిన శునకం జ్ఞాపకాలను మర్చిపోలేకపోయారు. ఆ శునకాన్ని స్మరించుకుంటూ తనకున్న వ్యవసాయ భూమిలో దానికోసం ప్రత్యేకంగా ఓ సమాధి కట్టించారు. అంతేకాదు పరలోకంలో ఈ శునకం ఆత్మకు శాంతి చేకూరాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కుక్కకు సమాధి నిర్మించిన విషయం ఆ నోటా ఈ నోటా ఊరంతా తెలియడంతో ప్రతి ఒక్కరూ కుక్కకు సమాధి ఏంటీ కొత్తగా అంటూ ఆశ్చర్యపోతున్నారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe