ఈ ట్రాన్స్‌జెండర్ పోరాటానికి సలాం.. కొత్త చరిత్రకు శ్రీకారం

ట్రాన్స్‌జెండర్లు అంటే సమాజంలో చులకన ఉంటుంది. వారిని అందరూ చిన్నచూపు చూస్తుంటారు. కొంతమంది ట్రాన్స్‌జెండర్లు చేసే తప్పుల వల్ల మొత్తం ఆ కమ్యూనిటికే చెడ్డ పేరు వస్తుంది. వారు భిక్షాటన చేయడానికి తప్ప ఇంకెందుకు పనికి రారనే భావన ఉంది. కానీ తెలంగాణకు చెందిన ఓ ట్రాన్స్‌జెండర్ మాత్రం సరికొత్త చరిత్ర సృష్టించింది.

ఈ ట్రాన్స్‌జెండర్ పోరాటానికి సలాం.. కొత్త చరిత్రకు శ్రీకారం
New Update

ట్రాన్స్‌జెండర్లు అంటే సమాజంలో చులకన ఉంటుంది. వారిని అందరూ చిన్నచూపు చూస్తుంటారు. కొంతమంది ట్రాన్స్‌జెండర్లు చేసే తప్పుల వల్ల మొత్తం ఆ కమ్యూనిటికే చెడ్డ పేరు వస్తుంది. వారు భిక్షాటన చేయడానికి తప్ప ఇంకెందుకు పనికి రారనే భావన ఉంది. కానీ తెలంగాణకు చెందిన ఓ ట్రాన్స్‌జెండర్ మాత్రం సరికొత్త చరిత్ర సృష్టించింది. ఖమ్మం జిల్లాకు చెందిన రూత్ జాన్ కొయ్యల పీజీ మెడికల్ సీటు సాధించింది. అయితే ఆమెకు కేటాయించిన సీటు మాత్రం స్రీ, పురుష జెండర్ కిందనే ఉంది. కానీ రూత్ మాత్రం తనకు ట్రాన్సెండర్ కేటగిరిలోనే సీటు కేటాయించాలని పట్టుబట్టింది. ఈ మేరకు సంబంధిత అధికారులు, మంత్రులు, శాఖలకు అనేక వినతి పత్రాలు అందజేసింది. కానీ ఎలాంటి ఫలితం లేకపోవడంతో చివరి ప్రయత్నంగా హైకోర్టును ఆశ్రయించింది.

ఈఎస్ఐ ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ విభాగంలో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తూనే తన పోరాటం కొనసాగించింది. ఈ సమయంలో సంవత్సరానికి రూ.2.5 లక్షల రూపాయలు ఫీజు కట్టాల్సి ఉండడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. ఆమె పరిస్థితి అర్థం చేసుకున్న హాస్పిటల్ సూపరింటెండెంట్ తోటి అధ్యాపకులతో కలిసి లక్ష రూపాయల వరకు సమకూర్చారు. పలువురు న్యాయవాదులు సైతం ఫీజు కట్టేందుకు ముందుకు వచ్చారు. అలాగే స్వచ్చంద సంస్థ హెల్పింగ్ హాండ్స్ కూడా తన వంతు పాత్ర పోషించింది. రెండు సంవత్సరాలు సుదీర్ఘ విచారణ తర్వాత హైకోర్టు ఎట్టకేలకు ఓ సీటు ట్రాన్స్‌జెండర్ కింద కేటాయించాలని తీర్పు ఇవ్వడంతో ఆమె పోరాటం ఫలించింది. న్యాయస్థానం తీర్పుతో అధికారులు ఆమెకు ట్రాన్స్‌జెండర్ కేటగిరి కింద సీటు కేటాయిస్తూ ధ్రువీకరణ పత్రం అందజేశారు. దీంతో ఆమె సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.

పురుషుడు నుంచి ట్రాన్స్‌జెండర్‌గా మారేందుకు ఆపరేషన్ చేయించుకున్న వారికి ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలిపింది. అందుకే తాను గైనకాలజిస్ట్ అయి తన కమ్యూనిటీకి మెరుగైన సేవలు అందిస్తానని వివరించింది. పట్టుదలతో ప్రయత్నిస్తే తప్పకుండా విజయం చేకూరతుందని మరోసారి రూత్ జాన్ నిరూపించింది. ఆమె పోరాట పటిమకు అన్ని వర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe