Telangana Super Thermal Project: తెలంగాణ విద్యుత్ రంగానికి అద్భుత కానుక.. ప్రధాని ప్రారంభించిన పవర్ ప్రాజెక్ట్

ప్రధాని మోడీ ఈరోజు పెద్దపల్లిలో ఎన్‌టీపీసీకి చెందిన 800 మెగావాట్ల (యూనిట్-2) తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేశారు. తెలంగాణ విద్యుత్ రంగానికి ఈ ప్రాజెక్ట్ కీలకం కానుంది. దీని పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు. 

New Update
PM Modi : తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. ఎప్పుడంటే

Telangana Super Thermal Project: ప్రధాని మోడీ ఈరోజు తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో పలు ప్రాజెక్టులను ప్రారభించారు. సుమారు ఏడువేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులను ఈ సందర్భంగా ఆయన వర్చువల్ గా ప్రారంభించారు. దేశవ్యాప్తంగా విద్యుత్ రంగానికి సంబంధించిన పలు ప్రాజెక్టులను ప్రారంభించి, అంకితం చేయడంలో భాగంగా  మొట్టమొదటగా పెద్దపల్లిలో ఎన్‌టీపీసీకి చెందిన 800 మెగావాట్ల (యూనిట్-2) తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌ను ప్రధాని జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్ట్ అల్ట్రా-సూపర్‌క్రిటికల్ టెక్నాలజీ ఆధారంగా, తెలంగాణకు 85 శాతం విద్యుత్‌ను సరఫరా చేస్తుంది.  భారతదేశంలోని NTPC  అన్ని పవర్ స్టేషన్‌లలో కంటే దాదాపు 42 శాతం అత్యధిక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. 

తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (STPP) విశేషాలివే..
తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (STPP)(Telangana Super Thermal Project) తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా, రామగుండం గ్రామ సమీపంలో ఉన్న 4GW థర్మల్ పవర్ ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ రెండు దశల్లో అభివృద్ధి చేశారు.  మొదటి దశలో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో 1.6GW (2x800MW) బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్‌ ఇప్పటికే ప్రారంభం అయింది.  రెండవ దశ మూడు 800MW యూనిట్లను చేర్చడం ద్వారా ప్రాజెక్ట్‌కు 2.4GW పవర్ అందిస్తుంది. దీనిని ఈరోజు ప్రధాని మోడీ జాతికి అంకితం చేశారు. 

తెలంగాణలో (Telangana Super Thermal Project)విద్యుత్ సరఫరాను పెంపొందించడంతో పాటు, దేశవ్యాప్తంగా 24x7 సరసమైన, అధిక-నాణ్యత గల విద్యుత్ లభ్యత లక్ష్యానికి ఈ ప్రాజెక్ట్‌ ఉపయోగపడుతుంది. ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన కూడా ప్రధాని చేతుల మీదుగా జరిగింది. TSTPP స్టేజ్-1 యూనిట్-1 (800 MW) సెప్టెంబరు 2023లో వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించిన విషయం తెలిసిందే.  గతేడాది అక్టోబర్ 3న నిజామాబాద్ నుండి వర్చువల్ మోడ్ ద్వారా యూనిట్-1ని మోదీ జాతికి అంకితం చేశారు.

Also Read: ప్రధాని అంటే పెద్దన్న.. మోదీ మనసు దోచుకున్న తెలంగాణ సీఎం

TSTPP (Telangana Super Thermal Project) మొదటి దశ NTPC ప్రస్తుత రామగుండం స్టేషన్ ఆవరణలో అందుబాటులో ఉన్న స్థలంలో రూ.10,998 కోట్ల ఆమోదంతో ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 నిబంధనల ప్రకారం స్థాపించిన 5×800 MW (4,000 MW) సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ అక్కడ ఉత్పత్తి అయ్యే 85 శాతం శక్తిని తెలంగాణకు సరఫరా చేయడం తప్పనిసరి.

NTPC అధికారుల ప్రకారం, ప్రాజెక్ట్ అల్ట్రా-సూపర్‌క్రిటికల్ టెక్నాలజీతో పిట్-హెడ్ పవర్ స్టేషన్‌గా ఉంది, ఈ ప్రాజెక్ట్ తక్కువ ఖర్చుతో కూడిన విద్యుత్‌ను రాష్ట్రానికి అందిస్తుంది. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా విద్యుత్ లోటు రాష్ట్రానికి కూడా సహాయపడుతుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు