అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో తెలంగాణ విద్యార్థి చనిపోయాడు. జెట్ స్కీ ప్రమాదంలో తెలంగాణకు చెందిన 27 ఏళ్ల విద్యార్థి మృతి చెందాడు. రెండు జెట్ స్కీల ఢీకొనడం అతని అకాల మరణానికి దారితీసింది. విస్టేరియా ద్వీపం సమీపంలోని ఫ్యూరీ ప్లేగ్రౌండ్లో జరిగిన ఈ ఘటనలో 14 ఏళ్ల బాలుడు గాయాలు లేకుండా బయటపడ్డాడు. ఇటు వెంకటరమణను మాత్రం విధి ఆడిన నాటకంలో బలయ్యాడు.
తెలంగాణకు చెందిన 27 ఏళ్ల విద్యార్థి వెంకటరమణ పిట్టల, అమెరికాలోని ఫ్లోరిడాలో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నాడు జెట్-స్కీ ప్రమాదంలో విషాదకరంగా ప్రాణాలు కోల్పోయాడు. తెలంగాణలోని కాజీపేటకు చెందిన అతను ఇండియానా యూనివర్సిటీ-పర్డ్యూ యూనివర్సిటీ ఇండియానాపోలిస్ (IUPUI)లో హెల్త్ ఇన్ఫర్మేటిక్స్ ప్రోగ్రామ్లో చేరాడు. ఆంధ్రప్రదేశ్లోని NTR యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి ఫిజియోథెరపీలో బ్యాచిలర్ డిగ్రీని పొందిన తరువాత ఉన్నత విద్యను అభ్యసించడానికి US వెళ్లాడు. పిట్టల తన మాస్టర్స్ డిగ్రీ చేయవలసి ఉంది. ఈ ఘటనతో ఈ ఏడాది అమెరికాలో చనిపోయిన భారీయుల సంఖ్య 8కి చేరింది. ఇక అమెరికాలో భారతీయ విద్యార్థులపై దాడులు పెరిగాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
Also Read: ఈనెల 16న వైసీపీ అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థుల ప్రకటన!