అభినందనలు తెలిపిన పలువురు నాయకులు
నూతనంగా చైర్మన్ బాధ్యతలు తీసుకున్న రజినీ మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ తమ కుటుంబానికి అండగా నిలిచారన్నారు. తనపై నమ్మకముంచి బాధ్యతలు అప్పగించినందుకు ఆమె సీఎం కేసీఆర్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తమ కుటుంబం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌తో పాటు బీఆర్‌ఎస్ పార్టీకి ఎప్పుడు రుణపడి ఉంటుందన్నారు. ఈరోజు నాంపల్లిలోని ఆ సంస్థ కార్యాలయంలో రజనీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు.
బాధ్యతలు తీసుకున్న అనంతరం ఆర్‌టీవితో రజినీ..
సాయిచంద్ మరణం అనే మాట నాకు వినాలనిపించట్లేదు. ఎందుకంటే సాయిచందు తనతోనే ఉన్నాడు. ఎక్కడో ఒక చోట తన పాట, నాయకత్వంతో రెండు పాత్రలు పోశించారు. సాయిచందు జీవితం భిన్నమైంది. తన జీవితం కష్టాల నుంచి వచ్చిన వ్యక్తి. బయటి పరిస్థితులే అతడిని ఈ స్టాయికి తీసుకొచ్చాయి. ఆయన పాటతోనే నేను నడిచాను. విద్యార్థి ఉద్యమ సమయంలో తనతో నేను నడిచాను. తన ఉద్యమ స్పూర్తి తనకు ఎంతగానో నచ్చి తనని ప్రేమ వైపు నడిపించాయని తెలిపారు.
ఎమోషనల్ అయిన సాయిచంద్ భార్య
తనకు కష్టం వచ్చినా.. హ్యాపీగా ఉన్నా... తనతోనే ఉన్నానని సాయిచంద్ భార్య తెలిపింది. తనకు సీఎం కేసీఆర్ గారూ.. పెద్ద మనసు చేసుకొని నాకు పెద్ద బాధ్యతలను అప్పగించారని ఆమె ఎమోషనల్ అయ్యింది. తన ఆశయాన్ని నేను ముందుకు తీసుకెళ్తా నా భర్త అంతగా వర్క్ చేయకపోయినా తన ఆశయాల కోసం నేనెప్పుడూ తన లక్ష్యాలను నెరవేర్చేందుకు నేను నా బాధ్యతలను పూర్తిస్థాయిలో నెరవేరుస్తానంటూ చెప్పుకొచ్చింది.