పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పాలమూరు జిల్లా అభివృద్ది కాంగ్రెస్‌తోనే సాధ్యమని అన్నారు. ఈ జిల్లా అభివృద్ది కోసం జూపల్లి, గుర్నాథ్ రెడ్డి, దామోదర్ రెడ్డి గతంలో బీఆర్‌ఎస్‌లో చేరారని… తొమ్మిదేళ్లు గడిచినా కేసీఆర్ పాలమూరు జిల్లాను అభివృద్ది చేయలేదన్నారు. అందుకే వారంతా కేసీఆర్‌పై తిరుగుబావుటా ఎగరేశారని తెలిపారు. జూపల్లిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించేందుకు రేవంత్‌రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి జూపల్లి కృష్ణారావు ఇంటికి వచ్చారు. మంచి ముహూర్తం చూసుకుని వారంతా కాంగ్రెస్‌లో చేరుతారని రేవంత్‌రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.
పూర్తిగా చదవండి..పొంగులేటి, జూపల్లిని పార్టీలోకి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి!
కేసీఆర్ వ్యతిరేక రాజకీయ పునరేకీకరణ కోసం కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరుగుతున్నాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలను గెలిపించి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని క్రియాశీలకం చేస్తానన్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి జూపల్లి కృష్ణారావు ఇంటికి వెళ్లిన రేవంత్‌రెడ్డి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. రేవంత్, కోమటిరెడ్డి, జూపల్లి వీరి ముగ్గురి కలయికతో రాజకీయంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Translate this News: