TG SET: ప్రొఫెసర్, లెక్చరర్ అభ్యర్థులకు అలర్ట్.. టీజీ సెట్ పై కీలక అప్ డేట్! తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024 పరీక్షల తేదీల్లో స్పల్ప మార్పులు చేస్తున్నట్లు సెక్రటరీ ప్రొఫెసర్ నరేశ్‌రెడ్డి తెలిపారు. ఆగస్టు 28 నుంచి జరగాల్సిన పరీక్షలను సెప్టెంబరు 10 నుంచి నిర్వహించబోతున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు. By srinivas 02 Aug 2024 in జాబ్స్ తెలంగాణ New Update షేర్ చేయండి TG SET EXAMS: తెలంగాణ ప్రొఫెసర్, లెక్చరర్ అభ్యర్థులకు కీలక అప్ డేట్ వెలువడింది. తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీఎస్ సెట్)-2024 పరీక్ష తేదీల్లో స్వల్ప మార్పులు చేస్తూ టీఎస్ సెట్ మెంబర్ సెక్రటరీ ప్రొఫెసర్ నరేశ్‌రెడ్డి అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు మొదట సెట్ ఎగ్జామ్స్ ఆగస్టు 28, 29, 30, 31 తేదీల్లో ఆన్‌లైన్ విధానంలో నిర్వహించబోతున్నట్లు తెలిపిన సంగతి తెలిసిందే. కాగా యూజీసీ నెట్ పరీక్షల షెడ్యూల్‌ను సవరించడంతో సెట్ పరీక్ష తేదిల్లోనూ మార్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆగస్టు 28 వరకూ ఎడిట్ ఆప్షన్.. ఈ క్రమంలోనే సెట్ ఎగ్జామ్స్ సెప్టెంబరు 10 నుంచి మొదలవుతాయని, దరఖాస్తులను ఎడిట్ చేసుకునేందుకు ఆగస్టు 24, 28 తేదీల్లో అవకాశం ఇవ్వనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. హాల్ టికెట్లను వెబ్‌సైట్ నుంచి సెప్టెంబరు 2 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు. టీజీసెట్ దరఖాస్తు గడువు ఇప్పటికే ముగిసింది. రూ.3000 ఆలస్య రుసుముతో దరఖాస్తులు ఆగస్టు 6 వరకు సమర్పించేందుకు అవకాశం ఇచ్చారు. తెలంగాణలోని యూనివర్సిటీలు, డిగ్రీ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు/లెక్చరర్లుగా పనిచేయడానికి అర్హత కల్పించే పరీక్ష తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటి టెస్ట్ (TS SET – 2024) నోటిఫికేషన్‌ను ఉస్మానియా విశ్వవిద్యాలయం మే 4న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మే 14న ప్రారంభంకాగా, ఆగస్టు 6 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. ఇది కూడా చదవండి: Sexual Harassment: యువతితో వృద్ధుడి వికృత చేష్టలు.. వెనకాల నిలబడి అవి తాకుతూ: వీడియో వైరల్ ఇక జనరల్ స్టడీస్, 29 సబ్జెక్టుల్లో కలిపి మొత్తం 2 పేపర్లకు జరుగనుండగా.. ఒక్కో పేపర్ 1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్ 2లో 100 ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి. పరీక్ష వ్యవధి మూడు గంటలు. పూర్తి వివరాలకోసం ఈ వెబ్ సైట్ సంప్రదించండి. www.telanganaset.org,www.osmania.ac.in #tg-set #exams-postponed మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి